అప్పుడెప్పుడో హృదయ కాలేయంతో ఇటు విమర్శలను అటు కాంప్లిమెంట్స్ ని సమానంగా అందుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరోసారి అదే టీమ్ తో కొబ్బరి మట్టగా వస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం రిలీజైన నాన్ స్టాప్ డైలాగ్ దీని మీద ఎంతో కొంత హైప్ ని తెచ్చిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ట్రైలర్ కూడా వచ్చేసింది. విషయమేంటో చూద్దాం. ఇలాంటి సినిమాల్లో లాజిక్ కానీ కథ కానీ పెద్దగా ఉండదని తెలిసినా నవ్వించడానికి ఏదో ఒక థ్రెడ్ ఉండాలి కాబట్టి దాని బట్టి కథను అల్లుకున్నారు.
సంపూ మొత్తం మూడు పాత్రలు పోషించాడు. పాపారాయుడు-పెద్దరాయుడు-ఆండ్రాయుడు. ఆరుగురు భార్యలతో లెక్కలేనంత పిల్లలతో సంసారాన్ని ఈదుతున్న పెద్దరాయుడు ఆఖరి తరం వారసుడు ఆండ్రాయుడు. వీళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది. దానికి ప్రతీకారం కోసమే ఆండ్రాయుడు రంగంలోకి దిగుతాడు. అసలు కథ ఏంటి అనేది అంతుచిక్కకుండా చిత్రవిచిత్రంగా ట్రైలర్ ని కట్ చేశారు
ఎంత నవ్వించే ఉద్దేశంతో కథను రాసుకున్నా మరీ అడల్ట్ కామెడీని చొప్పించి ఇదే ఇప్పటి ట్రెండ్ అనుకోమనేలా ఉంది మేకర్స్ తీరు. శివలింగం ముందు సంపూతో చొక్కా లేకుండా డిస్కో స్టెప్పులు వేయించడం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఆడపాత్రలు సైతం రెచ్చిపోవడం మరో కీలక అంశం. ముఖ్యంగా బాణం పదును లేదు అందుకే ముగ్గురు భార్యలున్నా పిల్లలు లేరు అని షకీలాతో సంపూని ఉద్దేశించి చెప్పడం దేనికి పరాకాష్టో పదం దొరకక ఇక్కడ వర్ణించకుండా వదిలేస్తున్నాం.
కొంత చీప్ కామెడీ కొంత డబుల్ మీనింగ్ అడల్ట్ హ్యూమర్ కొంత ఫన్ అన్ని కలగలసిన కొబ్బరిమట్ట ట్రైలర్ ద్వారా యూనిట్ తమ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పేసింది కాబట్టి సదరు టార్గెట్ ప్రేక్షకులు ఎంతవరకు సంతృప్తి పడతారో విడుదలయ్యాకే తెలుస్తుంది. సాయి రాజేష్ రచన రూపక్ రోనాల్డ్ సన్ టేకింగ్ హృదయ కాలేయంకు ఏ మాత్రం తీసిపోయేలా లేవు.
Full View