ఆయన ముందు రాజకీయ నాయకుడు కాదు, సీనియర్ ఎన్టీయార్ అభిమాని. ఆ తరువాత నందమూరి ఫ్యామిలీ అభిమాని. ఇక నందమూరి హరిక్రిష్ణతో ఆయన ప్రస్థానం సాగింది. హరిక్రిష్ణ కొడుకు జూనియర్ ఎన్టీయార్ తో సాన్నిహిత్యం బలపడింది. అలా కీలక మలుపు తీసుకుని జూనియర్ ఎన్టీయార్ సపోర్ట్ ని బాగా సంపాదించుకున్నారు. దీని వల్ల 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ని సంపాదించి ఎమ్మెల్యే అయ్యారు. ఒక విధంగా చెప్పుకోవాలీ అంటే ఈ రోజున కొడాలి నాని రాజకీయ వైభోగానికి కారణం హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీయర్ అనే చెప్పాలి.
ఇక సీనియర్ఎ న్టీయార్ అంటే ప్రాణం ఇచ్చే కొడాలి నాని జూనియర్ అంటే కూడా బాగా ఇష్టపడతారు. అయితే ఈ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది అని చెబుతారు. కొడాలి నాని 2012లో టీడీపీని వదిలేసారు. ఆ టైమ్ లో ఆయన జూనియర్ కి ఒక మాట చెప్పే వచ్చారని అంటారు. అలాగే హరిక్రిష్ణకు పార్టీలో ప్రాధాన్యత దక్కపోవడంతో ఆయన టీడీపీని పక్కన పెట్టారు అని చెబుతారు. ఒక విధంగా రాజకీయాలు వేరు అయినా హరిక్రిష్ణ ఫ్యామిలీ అంటే కొడాలి నాని ఇప్పటికీ ప్రాణం పెడతారు అన్నది అందరి అభిప్రాయం.
అయితే వీటిని పటాపంచలు చేస్తూ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాటను కొడాలి నాని బయటపెట్టేసుకున్నారు. 2029 ఎన్నికల వేళ అటు వైపున జగన్ ఇటు వైపున జూనియర్ ఎన్టీయార్ పరస్పరం రాజకీయ యుద్ధానికి తెర తీసి ఎన్నికల్లో తలపడితే మీరు ఏ వైపు ఉంటారు అన్నది ఆ ప్రశ్న. నిజానికి దానికి జవాబు బహు కష్టం. ఎందుకంటే ఇపుడు నాని వైసీపీలో ఉన్నరు. 2029 అంటే మరో ఏడేళ్ళలో జరిగే దానికి ఆయన ఇపుడే జవాబు చెప్పి ఉన్న చెట్టు కొమ్మను నరుక్కోలేరు.
అలాగని జూనియర్ వద్దు అనలేని సంకట స్థితి. దీనికి లౌక్యంగా జవాబు చెప్పి తప్పించుకోవచ్చు. అపుడు కదా చూద్దామని చెప్పినా బాగుంటుంది. కానీ వైసీపీలో ఒక్కసారిగా అనుమానాలు పెరుగుతాయి. దాంతో కొడాలి కరెక్ట్ గానే తన కుండబద్ధలు కొట్టే నైజానికి తగినట్లుగనే మాట్లాడారు. ఆయన తాను జగన్ వైపే ఉంటాను అని చెప్పేశారు. అంతే కాదు తాను మరణించేవరకూ వైసీపీని వీడబోను అని కూడా ఒట్టేసి మరీ చెప్పారు.
ఇది నిజంగా జూనియర్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూసే అంటున్నారు. ఎందుకంటే నానికి చంద్రబాబుతో పడదు, అందుకే ఆయన టీడీపీని వదిలేశారు అని అంతా అంటారు. అయితే అదే టీడీపీని జూనియర్ టేకోవర్ చేస్తే పక్కన కచ్చితంగా నాని ఆయన పక్కన ఉండి కధ నడిపిస్తారు అని ఇప్పటిదాకా అంతా ఊహించారు. కానీ నాని మాత్రం చచ్చేదాకా వైసీపీని వీడను అని కొత్త మాట చెప్పేశారికి జూనియర్ ఫ్యాన్స్ కి షాక్ తినడమే అవుతోంది అంటున్నారు.
ఇక గుడివాడలో ఎన్టీయార్ ఫ్యాన్స్ అంతా నానితోనే ఉంటున్నారు. ఆయన్ని గెలిపించుకుంటున్నారు. ఇపుడు ఆయన ఈ రకంగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశాక వారి మద్దతు ఉంటుందా అన్నది కూడా చర్చగా ఉంది. మరో వైపు చూస్తే నాని జూనియర్ వైపు ఉండను అని ఎందుకు అన్నారు అన్న చర్చ కూడా వస్తోంది. జూనియర్ కి నానికి మధ్య గ్యాప్ అలాగే ఉందా అన్న మాట కూడా వినిపిస్తోంది.
మొత్తానికి కొడాలి నాని జూనియర్ కి ఒకనాటి ఆప్తుడు కానీ ఇపుడు కారేమో అన్న భావన కలిగేలా ఆయనే స్వయంగా తన గురించి చెప్పేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి జూనియర్ కి రాజకీయంగా మద్దతు ఇవ్వను అనడం ద్వారా కొడాలి తన రాజకీయాన్ని బయటపెట్టుకున్నారు. దీని వల్ల ఆయన ఫ్యూచర్ లో నష్టపోతారా లాభపడతారా అన్నది చూడాలి.