అనారోగ్యంతో మృతి చెందిన కోడి రామకృష్ణ అంతిమ యాత్ర ముగిసింది. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు సినీ ప్రముఖులు మరియు అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించడం జరిగింది. అక్కడ కొంత సమయం సందర్శకుల కోసం ఉంచారు. అక్కడకి సినీ ప్రముఖులు పలువురు వచ్చి కోడి రామకృష్ణ మృత దేహంను సందర్శించారు. అనంతరం అక్కడ నుండి మహాప్రస్థానంకు తీసుకు వెళ్లారు. అభిమానులు మరియు బంధు మిత్రుల కన్నీటి వీడ్కోలుతో అంతమయాత్ర సాగింది.
మహాప్రస్థానంలో ఆయన కూతురు దీపిక అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కూతురే అయినా కొడుకులా మారి తన తండ్రి చితికి నిప్పు అంటించారు. అంత్యక్రియల నేపథ్యంలో మహాప్రస్థానంకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. సినీ ప్రముఖులు పలువురు మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రలో పాల్గొని దహస సంస్కారాలు పూర్తి అయ్యే వరకు ఉన్నారు.
అంతిమ యాత్ర ప్రారంభంకు ముందు సినీ పరిశ్రమకు చెందిన వందలాది మంది ప్రముఖులు, వేలాది మంది అభిమానులు ఆయనను కడసారి చూసేందుకు ఆయన ఇంటికి మరియు ఫిల్మ్ ఛాంబర్ కు క్యూ కట్టారు. తెలుగు సినీ వెండి తెరపై ఎన్నో ప్రయోగాలు చేసి, వందకు పైగా సినిమాలను చేసి ప్రేక్షకులను రంజింప జేసిన సినీ శాస్త్రవేత్త జర్నీ ముగిసింది. ఆయనకు తెలుగు సినీ కళామ తల్లి ఘన నివాళ్లు సమర్పించింది.