రాజమౌళి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ బాహుబలి. ఈ సినిమాతోనే తెలుగేతర ప్రేక్షకులకు కూడా జక్కన్న అంటే ఏంటో తెలిసింది. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు రాజమౌళి. ఐతే సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం ‘బాహుబలి’ కంటే ‘ఈగ’ సినిమాలోనే రాజమౌళి ప్రతిభ ఎక్కువ కనిపిస్తుంది అంటున్నాడు.
తనకు ‘ఈగ’ సినిమానే ఎక్కువ ఇష్టమని.. అలాంటి సినిమా తీసినందుకు దర్శకుడిగా రాజమౌళిని ఎక్కువగా అభినందిస్తానని అన్నాడు. ‘బాహుబలి’ లాంటి సినిమా తీయడంలో నిర్మాతలదే పెద్ద సాహసమని.. వాళ్లు ఆ సినిమా కోసం అన్నీ సమకూర్చారని.. ధైర్యంగా ముందడుగు వేశారని.. కాబట్టి ఆ సినిమా విషయంలో నిర్మాతలకే ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలని కోడిరామకృష్ణ అన్నారు. ఇక దర్శకుడిగా రాజమౌళికి ‘ఈగ’ సినిమాకే ఎక్కువ మార్కులు వేస్తానన్నాడు.
ఈగను హీరోగా పెట్టి అలాంటి సినిమా తీయడం అద్భుతమైన విషయం అని.. ఆ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించి రాజమౌళి తన ప్రతిభను చాటుకున్నాడని ప్రశంసించాడు. ఈ సినిమాకే రాజమౌళికి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాల్సిందని కోడిరామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాంకేతికత పెరిగిన నేపథ్యంలో గ్రాఫిక్స్ ను దర్శకులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని.. ఐతే సినిమా కోసం గ్రాఫిక్స్ ఉండాలి కానీ.. గ్రాఫిక్స్ కోసం సినిమా తీయడం మాత్రం కరెక్ట్ కాదని కోడిరామకృష్ణ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/