నయనతార సినిమాను ఆపేశారు

Update: 2019-06-14 05:26 GMT
ఇవాళ తాప్సీ గేమ్ ఓవర్ తో పాటు నయనతార తమిళ్ మూవీ కొలైయుతిర్ కాలం సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు కొద్దిరోజుల క్రితం వరకు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. అయితే దీనికి అనూహ్యంగా బ్రేక్ పడింది. దర్శకుడు బాలాజీ కుమార్ దీని కథ మీద తనకు హక్కులు ఉన్నాయని రచయిత సుజాత రచించిన నవలను 10 లక్షలకు హక్కులు కొన్నానని తనను సంప్రదించకుండా నేరుగా తీసి విడుదల చేస్తున్నారని ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు.

దీన్ని పరిశీలించిన న్యాయస్థానం రిలీజ్ మీద స్టే విధిస్తూ 21 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా నిర్మాతలకు నోటీసు పంపింది. ఇప్పుడిది పెద్ద వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ టైంలో సీనియర్ నటులు రాధారవి నయన్ మీద కామెంట్స్ చేసింది ఈ సినిమా ఫంక్షన్ లోనే. సో నయన్ హారర్ మూవీ కోర్టు మెట్ల దగ్గరే ఆగిపోయింది. దీన్ని తెలుగులో కూడా డబ్ చేసి ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ మనవాళ్ళు అంతగా ఆసక్తి చూపలేదు.

ఇటీవలే వచ్చిన ఐరా ఫలితం ఇంకా కళ్ళ ముందే ఉండటంతో కేవలం నయన్ బ్రాండ్ మీద తెలుగులో మార్కెట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఒకవేళ అక్కడ సక్సెస్ అయ్యాక చూద్దామని ఎవరైనా అనుకున్నారేమో కానీ మొత్తానికి నయన్ సినిమాకు బ్రేక్ పడింది. దీని దర్శకుడు చక్రి తోలేటి తెలుగువాడే. కమల్ వెంకీలతో ఈనాడు అజిత్ తో డేవిడ్ బిల్లా తీసాడుగా అతనే. మరి ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూడాలి


Tags:    

Similar News