వరదలు చెన్నయ్ ని అల్ల కల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రకృతికి సామాన్యుడు - సెలబ్రిటీ అనే తేడా తెలీదు అనడానికి ఈ ఉదాహరణ చాలు. ఇటీవలి కాలంలో వరదలకు సామాన్యుల గృహాలన్నీ నీట మునిగిపోయాయి. సేమ్ టు సేమ్ సీన్ సెలబ్రిటీల ఇళ్లలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా చెన్నయ్ లో పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమిళ హీరోలు, నటీనటులంతా గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి పై ఫ్లోర్ కి సమాన్లు సర్ధేయాల్సిన పరిస్థితి నెలకొంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ స్వగృహం - హీరో సిద్ధార్థ్ సొంతిల్లు నీట మునకేశాయి. స్టార్ హీరోలు సూర్య - కార్తీ ఇంట్లోకి నీరు వెళ్లిపోయింది. సీనియర్ నటి లక్ష్మి - నటుడు రాజ్ కిరణ్ అయితే తమ సొంతిల్లు విడిచిపెట్టి బోట్ లో వేరే చోటికి తరలి వెళ్లిపోయారు. బీచ్ పరిసరాల్లో నివాసం ఉంటున్న ఖుష్బూ ఇంటిని వరదనీరు చుట్టుముట్టేసింది. కమెడియన్ వివేక్ వరదల టైమ్ లో హైదరాబాద్ లోనే ఇరుక్కుపోయాడు. చెన్నయ్ లోని అతడు ఉంటున్న ఇల్లు పూర్తిగా నీట మునకేసింది. ఇలా లెక్కలు తీస్తే చాలామంది సెలబ్రిటీల పరిస్థితి ఆగమ్యగోచరం. చెన్నయ్ కి ఇన్నేళ్లలో ఇలాంటి ఉప్పెన లేనేలేదని చెబుతున్నారు. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్. మునుముందు మహా ప్రళయం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఏదేమైనా.. చెన్నయ్ నగరం మునిగిపోవడానికి కేవలం ప్రకృతి విపత్తు ఒక్కటే కారణం కాదు. అక్కడ సరైన వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం ఒక ప్రధాన కారణం. ఎంతసేపూ ఓట్ల కోసం చెత్త రాజకీయాలు, తమకు అడ్డొస్తారనుకుంటే కమల్ హాసన్ - విజయ్ వంటి హీరోల సినిమాలను రిలీజ్ కాకుండా వేధించడం వంటి అంశాలపై ఫోకస్ పెట్టే తమిళ గవర్నమెంట్లు.. గట్టిగా వానలు కురిస్తే.. నీళ్ళు బయటకు వెళ్లిపోవడానికి సరైన మెకానిజం సిద్దం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయ్.