డిసెంబర్ 21 - అక్కడా కొట్లాటే

Update: 2018-12-04 14:30 GMT
క్రిస్టమస్ ని టార్గెట్ చేసుకుని వస్తున్న సినిమాల పోటీ టాలీవుడ్ కే పరిమితం అనుకుంటున్నాం కానీ అన్ని భాషల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ప్రకటించిన వాటి ప్రకారం చూసుకుంటే పడి పడి లేచే మనసు-కెజిఎఫ్-అంతరిక్షం-జీరో కన్ఫర్మ్ కాగా ఒక్క వరుణ్ తేజ్ సినిమా గురించే ఇంకా అనుమానాలు క్లియర్ కాలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మొత్తం నాలుగు సినిమాలు బరిలో పోటీ పడాల్సి ఉంటుంది. పక్కన కోలీవుడ్ లో పరిస్థితి సైతం దీనికి భిన్నంగా ఏమి లేదు. అక్కడా ఇంచుమించు ఇదే తరహా పోటీ ఉంది.

ముందుగా డిసెంబర్ 20న కర్చీఫ్ వేసింది విజయ్ సేతుపతి. ఒక స్టార్ హీరో చరమాంక జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కాన్సెప్ట్ మీద ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్న సినిమాగా సీతకాతి రేస్ లో ముందుంది. దీని తర్వాత 21న ధనుష్ మారి 2 ఫిక్స్ చేసారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మారి సూపర్ హిట్ కాకున్నా దానికి సీక్వెల్ తీసిన ధనుష్ ధైర్యానికి ఫలితం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక జయం రవి ఆడంగ మారు అదే తేదీ తీసుకుంది. ధృవ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ తర్వాత ఆ స్థాయి యాక్షన్ మూవీ గా దీని మీద అక్కడ మంచి హైప్ ఉంది. వీళ్ళు చాలదు అన్నట్టు విష్ణు విశాల్ సిలుక్కువర్ పట్టి సింగం కూడా 21నే ప్రకటించుకుంది. ఇటీవలే విష్ణు చేసిన రట్ససన్ బ్లాక్ బస్టర్ కావడంతో దీని మీద  అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్ 20 21 తేదీల్లో తమిళనాడు కేరళలో విడుదలయ్యే తెలుగు సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగానే ఉంది. మన దగ్గరే అనుకుంటే కోలీవుడ్ లో కూడా పోటీ సినిమాల కొట్లాటే ఉందన్న మాట
Tags:    

Similar News