తెలుగింటి సీతమ్మగా అంజలి మనవాళ్లకు సుపరిచితం. వాకిట్లో సీతమ్మ ముగ్గులు వేస్తుంటే ఆ దృశ్యం కన్నుల పండువ చేసింది. అసలు సీతమ్మ అంటే ఇలానే ఉంటుందేమో.. అన్నంత అందంగా కనిపించింది. కట్ చేస్తే సీతమ్మకు అన్నీ కష్టాలే. అన్నీ వివాదాలే. ఓ తమిళ దర్శకుడు, తనని పెంచిన వారితో గొడవలు పెట్టుకుందన్న ప్రచారం పెనుదుమారమే రేపింది. అది కోర్టు గొడవల వరకూ వెళ్లి పెద్ద రచ్చయ్యింది. దాంతో వృత్తి పరమైన సమస్యలెన్నో వచ్చాయి. కొంతకాలం అవకాశాలే లేపోవడంతో ఆజ్ఞాతంలోనే ఉండిపోయింది. అయితే ఇన్నాళ్టికి పరిస్థితులు సద్ధుమణుగుతున్నాయి అనుకుంటే ఇప్పుడో కొత్త చిక్కు వచ్చి పడింది.
తెలుగు వరకూ ఓకేగానీ, తమిళ పరిశ్రమలో ఈ అమ్మడికి పెద్ద వ్యతిరేక బృందం తయారైంది. అటు దర్శకనిర్మాతలు, ఇటు మీడియా ఈ అమ్మడిపై గుర్రుమీద ఉన్నారని సమాచారం. తమిళ మీడియా అంజలిని బాయ్ కాట్ చేయాలని చూస్తోందిట. అంతేనా ఇకముందు ఈ అమ్మడు నటించే ఏ సినిమాకి ప్రమోషన్ చేయకూడదని అంతా ఏకమైపోయారని తెలుస్తోంది. దీనికి అంజలి ప్రవర్తనే కారణం అని చెప్పుకుంటున్నారు. ఇటీవలే సకలకళా వల్లవన్ చిత్రం కోసం జయం రవి, త్రిష పద్ధతిగా ఇన్ టైమ్ లో ప్రచారానికొస్తే, అంజలి గంట లేటుగా రావడమే కాకుండా వచ్చిన తర్వాత కూడా ఫోన్ లోనే కాలక్షేపం చేసింది. అందుకోసం స్టేజీ వెలుపలికి వెళ్లిపోయి అరగంట సేపైనా లోనికి రాలేదు. ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్లు పిలిస్తే ససేమిరా అని చెప్పిందిట.
దీంతో మొత్తం సీను రివర్సయిపోయింది. అంజలిని బాయ్ కాట్ చేసేవరకూ సీన్ వెళ్లిపోయింది. సీతమ్మా ఇలా అయితే ఎలాగమ్మా? వ్యక్తిగత బిహేవియర్ సరిగా లేకపోతే ఎందరో తారలు కాలగర్భంలో కలిసిపోయారు. కాస్త శాంతించి అందరికీ సహకరించుమా..