మెగా డాటర్ బైక్ రైడ్ చేస్తే..

Update: 2018-06-05 05:54 GMT
మెగా యువ హీరోలు ప్రస్తుతం ఎవరి స్టైల్ లో వారు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సొంతంగా ఒక మార్కెట్ ను కూడా సెట్ చేసుకున్నారు. అలాగే వారి తరహాలోనే హిట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది మెగా డాటర్ నిహారిక. మరి బిగ్గెస్ట్ హిట్ కాకపోయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందో గాని ప్రస్తుతం చాలా హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

మెగా బ్రదర్స్ షూటింగ్ లకు వెళ్లి అక్కడ కొత్త కొత్త విషయాలతో పాటు ఇతర పనుల్లో కాస్త సహాయపడుతోందట. సంగతి పక్కనపెడితే గతంలో నిహారిక అల్లు అర్జున్ - నా పేరు సూర్య సినిమా షూటింగ్ కి వెళ్లి బాగానే ఎంజాయ్ చేసిందట. చాలా వరకు కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్ట్ అనిపించి చిత్ర యూనిట్ తో కలిసిందట. పైగా నాగబాబు సహ నిర్మాత కావడంతో ఆ సైడ్ నుంచి కూడా అలోచించి వెళ్లింది.

ఇక కాస్త షూటింగ్ బ్రేక్ లో అమ్మడు ఓ బైక్ ఏసుకొని చక్కర్లు కొట్టేసింది. నిహారికకు బైక్ డ్రైవ్ చేయడం ముందు నుంచి అలవాటే. ఇక అమ్మాయిలు ఏ మాత్రం తక్కువ కాదని స్టైలిష్ బైక్ నడుపుతూ దిగిన అప్పటి ఫొటోను సోషల్ మీడియాలో రీసెంట్ గా పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వస్తోంది.  
Tags:    

Similar News