మెగాస్టార్ వారసుల్లో దాదాపు అందరూ సినీ రంగంతో అనుబంధం ఏర్పరుచుకున్నారు. హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్లు ఏ రేంజ్ లో చెలరేగిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. కానీ కొణిదెల వారసురాళ్లు కూడా సినిమా రంగంతో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారు. తెరమీద హీరోయిన్ గా నాగబాబు కూతురు హల్ చల్ చేస్తుంటే.. తెరవెనక కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చిరు పెద్ద కూతురు సుశ్మిత తన రేంజ్ ఏంటో ఒక్క ఖైదీ నంబర్ 150తో చూపించేసింది.
ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి ఇంటర్వ్యూ ఇస్తే ఎలా ఉంటుంది? అద్దిరిపోదూ.. రీసెంట్ గా అలాంటి ఇంటర్వ్యూనే ఇచ్చారు సుశ్మిత అండ్ నీహారిక. ఖైదీలో రెండు కేరక్టర్స్ మధ్య వేరియేషన్ ఏంటి అని నీహారికను అడిగితే.. ఒక రోల్ కి జేబులో పెన్ ఉంటుంది.. మరో పాత్రలో చేతిలో ఎప్పుడూ పేపర్స్ ఉంటాయని నీహారిక ఆన్సర్ ఇచ్చింది. నీకు బుర్ర మాత్రం లేదు అంటూ సుశ్మిత ఇచ్చిన పంచ్ భలేగా పేలింది. చిరంజీవి లైఫ్ లో ఎప్పుడైనా హార్డ్ మూమెంట్ ఫేస్ చేస్తున్నపుడు ఎలా అనిపిస్తుంది అని సుశ్మితను అడిగితే.. 'ఎలా హ్యాండిల్ చేస్తారు.. ఇంతలా ఎలా ఉండగలుగుతారు' అని ఆశ్చర్యపోతానన్న సుశ్మిత. బాగా చిన్నపుడు జరిగిన ఓ సంఘటన అంటూ పాత కథను వివరించింది.
ఇక నీహారిక అయితే.. పబ్లిక్ లో కూడా చిరును చిరంజీవి డాడీ అని పిలుస్తూ ఉంటుంది. ఇందుకు కారణం ఏంటి అని ఆమెను అడిగితే.. 'వాళ్లు డాడీ అంటారుగా.. నాకు చిరంజీవి డాడీ అని పిలవడం అలవాటయింది' అని చెప్పింది. అయితే.. తన తండ్రి నాగబాబును మాత్రం నాన్నా అనే పిలుస్తానని చెప్పింది. నీహారిక యాక్టింగ్ యాంకరింగ్ మాత్రమే కాదు.. మిమిక్రీ కూడా చేస్తుందనే విషయం ఈ ఇంటర్వ్యూ ద్వారానే జనాలకు తెలిసింది.
ఖుషీలో పవన్-భూమికల సీన్ కు మిమిక్రీ చేసిన మెగా డాటర్ కం హీరోయిన్.. చివర్లో 'లాస్ట్ మనదైతే ఆ కిక్కే వేరప్పా' అనడమే కాదు.. సరిగ్గా షూటింగ్ చేశారా.. చేయలేదా.. మళ్లీ చెప్పాలా అంటూ హంగామా చేసి పారేసింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల గురించి రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్స్ పై అడిగినప్పుడు.. 'మనం ఏంటో.. మన ఫ్యామిలో ఏంటో తెలిసినపుడు బైటవాళ్లు లక్షా తొంభై అనుకుంటారు.. మనం అవన్నీ ఎందుకు తీసుకోవాలి' అని నీహారిక చెప్పిన ఆన్సర్ అదరహో అనాల్సిందే.
ఇక చిరంజీవి సినిమాల్లో ఇప్పటి మెగా యంగ్ హీరోలు రీమేక్ చేస్తే.. పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ వరుణ్ అంటూ సుశ్మిత ఓ మూవీ గురించి చెబితే.. నీహారిక మరో మూవీని గురించి అభిప్రాయం పంచుకుంది. మొత్తం ఇంటర్వ్యూలో ఈ అక్కా చెల్లెళ్ల ఆన్సర్ల కంటే.. వీళ్లిద్దరి కెమస్ట్రీనే ఎక్కువ ఆకట్టుకుంది.
Full View