మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'ఆచార్య'లో మహేష్ బాబు ఓ అతిథి పాత్ర చేయబోతున్నట్లు నెల కిందట ఎంత విస్తృతంగా ప్రచారం జరిగిందో తెలిసిందే. ఎలాగూ వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వడంతో మహేష్ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడని.. చరణ్ కోసం ఈ పాత్రను అనుకున్నప్పటికీ.. అతను 'ఆర్ఆర్ఆర్'లో బిజీగా ఉండటంతో డేట్లు కేటాయించే పరిస్థితి లేదని, ఈ నేపథ్యంలోనే మహేష్ వద్దకు ఈ పాత్ర వెళ్లిందని అన్నారు. కట్ చేస్తే మహేష్ ఈ సినిమాలో చేయట్లేదని వెల్లడైంది. స్వయంగా చిరంజీవే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. మహేష్ పేరు అసలెలా తెరపైకి వచ్చిందో కూడా తెలియదు అనేశాడు. అంతటితో వ్యవహారం ముగిసిపోలేదు. ఇప్పుడు కొరటాల శివ వచ్చి ఈ సినిమాలో అతిథి పాత్ర విషయంలో తాను టెన్షన్ పడుతుంటే.. అవసరమైతే తాను చేస్తానంటూ ముందుకొచ్చాడని వెల్లడించాడు.
దీన్ని బట్టి చూస్తే అసలు మహేష్ పేరు ఎలా తెరపైకి వచ్చిందన్నదే తెలియదని.. ఏ దశలోనూ మహేష్ గురించి చర్చ జరగలేదని చిరు అన్నమాట నిజం కాదనే అనిపిస్తోంది. మహేష్ ఇలా ముందుకొచ్చిన విషయాన్ని చిరుకు కొరటాల చెప్పకుండా ఉండి ఉండడు. మరి ఇంతకుముందు ప్రచారం జరిగినట్లు పారితోషకం విషయంలో తేడా కొట్టిందో ఏమో తెలియదు కానీ.. మహేష్‌తో ఈ పాత్ర చేయించే విషయంలో చర్చ మాత్రం కచ్చితంగా జరిగే ఉండొచ్చని తెలుస్తోంది. తాజా ఇంటర్వ్యూలో కొరటాల వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మహేష్ ఈ మొత్తం వ్యవహారంలో హర్టయ్యాడేమో.. తన గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడి అతణ్ని కూల్ చేసే ప్రయత్నం కొరటాల చేస్తున్నాడేమో అనిపిస్తోంది. మహేష్‌ది చాలా గొప్ప మనసంటూ నొక్కి నొక్కి చెబుతూ అతణ్ని పొగిడే ప్రయత్నం కొరటాల చేయడంలో ఉద్దేశం వేరే అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. కనీసం తనకు, మహేష్‌కు మధ్య టెర్మ్స్ చెడిపోకుండా కొరటాల చూస్తున్నాడేమో అని కూడా అనిపిస్తోంది. మహేష్‌తో తన హ్యాట్రిక్ మూవీ ఉంటుదని కూడా కొరటాల ఈ సందర్భంగా నొక్కి చెప్పడం గమనార్హం.