'ఆచార్య' వైఫల్యం స్టార్ మేకర్ కొరటాల శివని ఎంతటి విమర్శలకు గురి చేసిందో తెలిసిందే. సంచలనాలు నమోదు చేయాల్సిన సినిమా కనీస ఫలితం కూడా సాధించకుండా నిష్ర్కమణకు గురవ్వడంతో మెగా అభిమానుల్లో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఓ సెక్షన్ ఆడియన్స్ నుంచి కొరటాల తీవ్ర విమర్శలు..ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
సినిమాకి తానే కర్త..కర్మ...క్రియ అయిన సందర్భం ఆయన్ని మరింత నిరాశలోకి నెట్టింది. ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలవడమే ఇంతటి ఉత్పతనానికి దారి తీసింది. కరుణ చూపించాల్సిన తోటి సహచర రచయితల ద్వయం సైతం పుండు మీద కారం చల్లే వ్యాఖ్యలు ఆయన్ని మరింత బాధించాయి. దర్శకుడి గత సక్సెస్ ల్ని సైతం విస్మరించి ఎటాకింగ్ కి దిగడం కొరటాల్ని తీవ్ర నిరాశ..నిస్పృహకి గురి చేసింది.
అయినా ఆయన పడి లేచిన కెరటం లాంటాడు. ఇలాంటి విమ్శలెన్నో ఎదుర్కునే ఆ స్థాయికి చేరుకున్నారు. డైరెక్టర్ గా ఎదిగే క్రమంలో ఆయన కథలు ఎన్నోసార్లు చోరీకి గురయ్యాయి. కష్టం కళ్ల ముందు కరిగిపోతున్నా పట్టించుకోలేదు. అది కొకాపోతే మరొకటని తన ప్రతిభను మాత్రమే నమ్ముకుని ఎదిగిన దర్శక శిఖరమతను. ఆ శిఖరం మరోసారి గర్జించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఎదరైన వైఫల్యానికి...విమర్శలకి...సవాళ్లకి అన్నింటికి బధులు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ నే ఆయుధంగా మలుచుకోబోతున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవు తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరిలో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంత వరకూ కొరటాల పాన్ ఇండియా కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కేవలం తెలుగు అభిమానులే టార్గెట్ గా సినిమాలు చేసారు. వాస్తవానికి తారక్ తో పాన్ ఇండియా అని కూడా ముదు అనుకోలేదు. ఇదంతా మధ్యలో వచ్చిన మార్పులు. ఈ క్రమంలోనే స్ర్కిప్ట్ లో పాన్ ఇండియాకి అవసరమైన కొన్ని రకాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
కొరటాల మార్క్ కంటెంట్ లోనే యూనిర్శల్ అప్పీల్ వచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించే దిశగా కొరటాల పావులు కదుపుతున్నారుట. భారీ కాన్సాస్ పైనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారుట. తన ప్లాన్ గనుక వర్కౌట్ అయితే ఎన్టీఆర్ ఇమేజ్ ని రెట్టింపు చేసే సినిమా అవుతుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. కొరటాల గత సినిమాలన్నింటిని తారక్ సినిమా సునాయాసంగా క్రాస్ చేయడమే కాక సరికొత్త రికార్డులు దిశగా పయనించడం ఖాయమని అంటున్నారు.
మరి ఈసోర్స్ అంతా నిజమైతే కొరటాల సింహంలా గర్జించడం ఖాయమనే చెప్పొచ్చు. రైటర్ గా ఆయన అనుభం..సక్సెస్ ఫుల్ మేకర్ గా గత చిత్రాల బాక్సాఫీస్ వసూళ్లు చూస్తే కొరటాలని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి ఛాన్స్ లేదు. కొరటాల పూర్తి స్వేచ్ఛతో చేస్తున్న సినిమా ఇది. మరి ఈ సమీకరణాల సాధన ఎంత వరకూ సాద్యమవుతుందో చూద్దాం.