ఆచార్య డిజాస్టర్ రిజల్ట్ మెగా ఫ్యామిలీని మెగాభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ లాంటి అపజయమెరుగని దర్శకుడి నుంచి ఇలాంటి డిజాస్టర్ ని ఎవరూ ఊహించలేదు. దాంతో కొరటాలపై నేరుగానే చిరు అభిమానులు ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే ఏదైనా సినిమా జయాపజయాలకు రకరకాల కారణాలుంటాయన్నది జగమెరిగిన సత్యం. ఈ సినిమా స్క్రిప్టు దశ లో అలాగే చిత్రీకరణలోనూ కొన్ని పొరపాట్లు జరిగాయని కూడా ప్రచారం సాగింది.
ఇకపోతే ఇప్పుడు కొరటాల ముందు బిగ్ ఛాలెంజ్ ఉంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ పాజిటివ్ నోట్ తో స్టార్టయ్యింది. ఈ సినిమా కి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి.
గాడ్ ఫాదర్ విజయం దిశగా దూసుకెళుతోందని మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో చిరు అభిమానులు సోషల్ మీడియాలో 'బాస్ ఈజ్ బ్యాక్' అనే ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
ఆచార్య భారీ డిజాస్టర్ ని గుర్తు చేస్తూ కొరటాలపై మరోసారి విరుచుకుపడుతున్నారు.''జయం మోహన్ రాజా వంటి చిన్న దర్శకుడు చిరంజీవిని ఎలా చూపించాడో చూడండి. ఇదీ మన మెగాస్టార్ నుంచి ఆశించేది. మీరు ఆచార్యతో చేసినది పూర్తిగా స్క్రాప్. బహుశా మీరు రాజా నుండి ఒకట్రెండు పాఠాలు నేర్చుకోవాలి'' అని మెగా అభిమాని ఒకరు ట్వీట్ చేశారు.
అయితే కొరటాల లాంటి స్టార్ రైటర్ కం డైరెక్టర్ ఈ ఛాలెంజ్ ని ధీటుగానే తీసుకుంటారనడంలో సందేహం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో తదుపరి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేయడం ద్వారా దీనికి సమాధానమిస్తారు. ఎన్టీఆర్ 30ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ చిత్రంతో అతడు మరోసారి జనతా గ్యారేజ్ ని మించిన హిట్టు ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రమే మెగాభిమానుల ప్రశ్నలకు సరైన సమాధానం అవుతుంది. అన్ని ట్రోలింగ్స్ కి ఒకటే సమాధానం అతడు సిద్ధం చేయాలి. కొరటాల ఈ సారి తారక్ కోసం పాన్ ఇండియా స్క్రిప్టును మలిచే ప్రయత్నంలో ఉన్నాడని ఆర్.ఆర్.ఆర్ తర్వాత మారిన ఇమేజ్ కి తగ్గట్టు తారక్ ని చూపించనున్నాడని ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.