ఈ హైద్రాబాద్ కు ఏమైంది? -కొరటాల

Update: 2017-10-10 08:38 GMT
ప్రస్తుతం హైద్రాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. విపరీతంగా కురుస్తున్న కుండపోత కారణంగా జనాలు అల్లాడిపోతున్నారు. రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు జనాలను ఏ రేంజ్ లో ఇక్కట్లకు గురి చేస్తున్నాయో చెప్పాల్సిన పనే లేదు.

ఇప్పుడు దర్శకుడు కొరటాల శివకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జనాలు పడుతున్న ఇబ్బందులనే తన స్టైల్ లో అందరికీ అర్ధమయ్యేలా చెప్పాడు కొరటాల. అఫ్ కోర్స్.. తనకు కూడా ఆ పరిస్థితి ఎదురయ్యాకే స్పందించాడు లెండి. '2 గంటలు.. జూబిలీ హిల్స్ నుంచి మాదాపూర్ కు వెళ్లేందుకు 2 గంటలు. ఇంకో 2 గంటలు పట్టినా ఆశ్చర్యం లేదు. హైద్రాబాద్ కు ఏమవుతోంది?. వర్షాలను హైద్రాబాద్ భరించలేదా?' అంటూ ట్వీట్ చేశాడు కొరటాల. సింగిల్ లైన్ లో తన ఫీలింగ్ ను ఎక్స్ ప్రెస్ చేశాడు. గత నెలలో ఈ దర్శకుడు పాలిటిక్స్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుత పాలిటిక్స్ ను మనం మార్చగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

రీసెంట్ గా మంచు లక్ష్మి కూడా హైద్రాబాద్ ఇలాగే హైద్రాబాద్ ట్రాఫిక్ పై రియాక్ట్ అయింది. అఫ్ కోర్స్.. ఆమెకు జనాలు రిటార్ట్ ఇస్తూ ట్వీట్స్ పెట్టారు. ఇప్పుడు కొరటాల శివ కూడా ఇదే తరహా ట్వీట్ పెట్టినా.. వర్షాలతో హైద్రాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులు కావడం.. అందరికీ ఎదురవుతున్న సమస్య కావడంతో.. పెద్దగా ఆపోజిట్ రియాక్షన్స్ రాలేదు.
Tags:    

Similar News