టీజర్ కట్ చేయడం కత్తిమీద సాములాంటి వ్యవహారమే. రెండున్నర గంటల సినిమాలో ఎక్కడ ఏది కట్ చేసి ప్రేక్షకుల్ని టీజ్ చేయాలో, ఎలా ఆసక్తికి గురిచేయాలో దర్శకులకు అంత తొందరగా అంతు చిక్కదు. అందుకే కొద్దిమంది దర్శకులు ఏదో కట్ చేశాం, విడుదల చేశాం అన్నట్టు టీజర్ ని మొక్కుబడిలా చూపించేస్తుంటారు. కానీ కొరటాల శివ మాత్రం ఆ విషయంలో భలే చాకచక్యం ప్రదర్శిస్తుంటాడు. కేవలం కొన్ని సెకన్ల నిడివితో పూర్తయిపోయే టీజర్‌లో సినిమా కంటెంట్ ని చెబుతూనే ప్రేక్షకుల్ని తనదైన శైలిలో టీజ్ చేస్తుంటాడు.
ఆయన మొదటి సినిమా మిర్చి నుంచి తీసుకోండి. అసలెప్పుడూ లెక్క తప్పలేదు. తాజాగా విడుదల చేసిన జనతా గ్యారేజ్ విషయంలోనూ ఆ పొరపాటు జరగనీయలేదు. `వీలైతే ప్రేమిద్దాం డూడ్.. పోయేదేముంది? తిరిగి ప్రేమిస్తారంతే` అనే డైలాగ్ తో మిర్చి టీజర్ ని కట్ చేశాడు. `ఊరిని దత్తత తీసుకోవడమంటే రోడ్లు - రంగులేసి పోతాడనుకొన్నాడ్రా...` అనే డైలాగ్ తో శ్రీమంతుడు టీజర్ ని - ఇప్పుడేమో బలహీనుడి పక్కన బలవంతుడు అంటూ కథానాయకుడి క్యారెక్టర్ నీ - సినిమా సబ్జెక్ట్ నీ చాటి చెప్పేలా `జనతా గ్యారేజ్` టీజర్ ని చూపించాడు. అసలు జనతా గ్యారేజ్ కథేంటో అనే సందేహంలో ఉన్న ప్రేక్షకులకు, అభిమానులకి తాజా టీజర్ తో ఓ క్లారిటీ వచ్చినట్టైంది.