టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. 'మున్నా' 'బృందావనం' 'బిందాస్' చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఒక్క విజయంతో టాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు కొరటాల శివ. ఆ తర్వాత 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' 'భరత్ అనే నేను' వంటి అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. టాలీవుడ్ లో పరాజయం ఎరుగని డైరెక్టరుగా.. మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు కొరటాల శివ. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో.. దాన్ని సమపాళ్లలో అందించే డైరెక్టర్ కొరటాల అని చెప్పవచ్చు. అందుకే ఈయన దర్శకత్వంలో సినిమా అంటే అది పక్కా హిట్ అనే భావనకు వచ్చేస్తారు ప్రేక్షకులు. కాగా కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు మెగా అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో తనయుడు రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా ప్రభావం వలన వాయిదా పడింది.
కాగా ఇప్పటికే 'ఆచార్య' సినిమా కోసం చాలా సమయం కేటాయించాడు కొరటాల. 'భరత్ అనే నేను' సినిమా కంప్లీట్ అయి రెండేళ్ళైనా కొరటాల నెక్స్ట్ సినిమా థియేటర్స్ లోకి రాలేదు. చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' సినిమా పూర్తయ్యే దాకా వెయిట్ చేయడం వలన సుమారు ఏడాది కాలం పోయింది.. ఎట్టకేలకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకుంటే కరోనా కారణంగా మరికొంత సమయం వేస్ట్ అయింది. దీంతో కొరటాల అప్సెట్ అయ్యాడట. షూటింగులకు అనుమతి లభించిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా చిత్రీకరణ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ.. షూటింగులకు కూడా సూచనప్రాయంగా ఒప్పుకోవడంతో.. కొరటాల నెక్స్ట్ షూట్ సీన్స్ రెడీ చేసే పనిలో పడ్డాడట. అయితే కేవలం కొద్దిమందితో షూట్ జరిపే విధంగా.. యాక్షన్ సీక్వెన్స్ కాకుండా డైలాగ్స్ తో పూర్తయ్యే సీన్స్ ని ముందుగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. దాంతో పాటు సమాంతరంగా సెట్స్ నిర్మాణాలను కూడా చూసుకోబోతున్నాడట. అంతేకాకుండా రామ్ చరణ్ డేట్స్ ఇష్యూ రాకుండా.. మళ్ళీ చరణ్ కోసం వెయిట్ చేస్తూ మరికొన్ని రోజులు వృధాగా పోకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.