కంకిపాడు నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో కంకి (బైటకు వచ్చిన వరి విత్తనాల గుత్తును కంకి అంటారు) మొలేస్తాడని ఎవరూ ఆనాడు ఊహించలేదు. కానీ అతగాడు కంకిపాడు నుంచి వచ్చాడు. కంకి మొలేశాడు. గొప్ప నటుడిగా ఎదిగి ఏకంగా పద్మశ్రీ అందుకున్నాడు. వరి కంకిలోని ఒక్కో విత్తనం పక్వానికి వచ్చిన చందంగా అతడి నటప్రస్థానం సాగింది. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్న సందర్భంలో కోట శ్రీనివాసరావు మాట్లాడిన విషయాల్ని ఎవరూ మర్చిపోలేం.
అతడికి మొదటి అవకాశం ఇచ్చింది రామోజీరావు. టి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతిఘటన' సినిమాలో ఓ చిన్న పాత్రతో వెండితెరకి పరిచయం చేశారు. నా కంటే బోలెడంత మంది ప్రతిభావంతులున్నారు. కానీ ఆ అవకాశం నాకే ఇచ్చి ప్రోత్సహించడం వల్లే నేను ఈ స్థాయికి ఎదిగానని వినమ్రంగా చెబుతారాయన. 2500 మందికి పద్మశ్రీ ఇస్తే అందులో నా పేరు కూడా ఉండడం గర్వంగా ఉందని అన్నారాయన. గుండు కాశయ్య పాత్ర ఇచ్చి సినీఆరంగేట్రానికి సహాయపడిన రామోజీరావుకు జీవితాంతం రుణపడి ఉంటానని కోట అన్నారు.