స్టార్లతో సినిమా అయినా, స్టార్లు లేని సినిమా అయినా కథకే నా ప్రధాన్యత. కథే నన్ను నిలబెడుతుంది. కథే బతికిస్తుంది. స్టార్లను తయారు చేస్తుంది. ఈ ఫార్ములాతోనే ముందుకు వెళతా అంటున్నారు క్రిష్. ఆయన దర్శకత్వం వహించిన కంచె చిత్రానికి ప్రేక్షకాభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఈ సినిమా టెక్నికాలిటీస్ గురించి పరిశ్రమ యావత్తు చర్చ సాగుతున్న ఈ వేళ క్రిష్ పంచుకున్న ఆనంద హేళ....
ఈ క్షణం ఇలానే సాగనీ....
గమ్యం’ - ‘వేదం’ - ‘కృష్ణం వందే జగద్గురుమ్’ - ‘కంచె’.. ఇలా ఏం చేసినా అవన్ని.. దర్శకుడిగా నా స్థాయిని, ఆలోచనా విధానాన్ని చాటిచెప్పే సినిమాలు. ప్రతి సినిమాలోనూ బలమైన భావోద్వేగాన్ని కథలో ప్రతిబింబించేలా ప్రయత్నించా. అందుకే పొరొచ్చింది. ‘కంచె’ సినిమాతో మరోమెట్టు ఎక్కాను, ఇది ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ చూడని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఒక ప్రేమకథకు జోడించి చెప్పాను. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇది ఎంతో ఆనందించే క్షణం. ఇలానే నన్ను సాగిపోనివ్వండి.
బాక్సాఫీస్ వసూళ్లే ఉత్సాహాన్ని పెంచాయి....
ఇప్పటివరకూ వేరు. ఇకనుంచి వేరు.. అన్నగుర్తింపును కంచే తీసుకొచ్చింది. నా టేకింగ్, వరుణ్ తేజ్ యాక్టింగ్, ఓ ఎమోషనల్ కథకు సెట్టయ్యాయి అన్న పేరొచ్చింది. తొలి వారాంతం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.కంచెకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వసూళ్ళు రావడం సంతోషాన్నిచ్చింది.
ఇదే ది బెస్ట్ అనుకుంటున్నా....
కెరీర్లో మొదటిసారి ఓ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇలాంటి సినిమాలు మరిన్ని తీయడానికి ప్రోత్సాహకమే.
కంచె కోసం చాలా రీసెర్చ్ చేసి ప్రతీ క్యారెక్టర్ కూ ఒక సరైన ఎమోషన్ ఇవ్వడంలో సఫలమయ్యా.. స్వతహాగా కంచె సినిమా దర్శకుడిగా తన బెస్ట్ వర్క్ అనుకుంటున్నా. వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ యాక్టింగ్ అదనపు అస్సెట్ అయ్యింది. సాయిమాధవ్ డైలాగులకు స్పందన అమోఘం.
మహిళలకు సెల్యూట్...
ఆఫ్ర్టాల్ ఆడది.. గర్భాన్ని వాడుకుని వదిలేస్తారు.. వంటి డైలాగులకు స్పందన బావుంది. మహిళామణులు పదే పదే మెచ్చుకుంటున్నారు ఈ సంభాషణల్ని. ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది కానీ,అమ్మతనం అన్ని దేశాల్లో ఒకేలా ఉంటుంది.. వంటి డైలాగులకు మహిళలు ఎమోషనల్ అవుతున్నారు. ఎంత మంచి సినిమా తీశావ్? అంటూ పొగిడేస్తున్నారు.
బాలీవుడ్ లో ప్రాజెక్టులున్నాయ్....
బాలీవుడ్ లో కొన్నిటికి సంతకాలు చేశాను.. తెలుగులోనూ ఉన్నాయ్.. వివరాలు త్వరలో చెబుతాను.