ఫోటో స్టొరీ: కొత్త బసవతారకం ఈ అమ్మాయే

Update: 2019-02-06 16:49 GMT
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఆల్రెడీ రిలీజ్ అయింది. రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు'కు సంబంధించి పెండింగ్ ఉన్న షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది.  మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని  దర్శకుడు క్రిష్ కొత్తగా కొన్ని మార్పుచేర్పులు చేశాడట.   ఈ పెండింగ్ ఉన్న పోర్షన్ తో పాటుగా ఆ సీన్స్ చిత్రణ కూడా ఇప్పుడు కొనసాగుతోంది.

మొదటిభాగంలో యుక్తవయసులో ఉన్న ఎన్టీఆర్.. బసవతారకం పాత్రలలో కూడా బాలకృష్ణ.. విద్యా బాలన్ లే నటించారు.  కానీ రెండో భాగంలో ఈ యంగ్ ఏజ్ లో ఉండే పాత్రలను కొత్త నటులతో చేయిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఫోటోలో పైనున్న అమ్మాయి బసవతారకం పాత్రలో నటిస్తోంది.  యువ ఎన్టీఆర్ పాత్రకు ఒక థియేటర్ ఆర్టిస్టును తీసుకున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే 'మహానాయకుడు' షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. దర్శకుడు క్రిష్ ముఖ్యతారాగణంపై 'రామ రామన్న' అంటూ సాగే పాటను తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారికంగా ప్రకటన రాలేదు గానీ బాలయ్య మాత్రం మహాశివరాత్రి వీకెండ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News