బాలీవుడ్ మెగా ప్రాజెక్టు ‘మణికర్ణిక’ నుంచి క్రిష్ వివాదాస్పద రీతిలో బయటికవ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథానాయిక కంగనా రనౌత్ అతి జోక్యమే అందుక్కారణమన్నది బహిరంగ రహస్యమే. క్రిష్ ఇక్కడ తన పాటికి తాను ‘యన్.టి.ఆర్’ సినిమా చేసుకుంటుంటే.. క్రిష్ తీసిన చాలా సీన్లు తీసేసి రీషూట్లు మొదలుపెట్టేసింది కంగన. ఆమె దర్శకత్వంలో తీసిన సన్నివేశాలు సినిమాలో చాలానే ఉండబోతున్నాయట. చిత్ర నిర్మాణ సంస్థ మద్దతు కంగనకు బాగానే ఉంది. ఐతే ఇందుకోసం సినిమాలో క్రెడిట్ కూడా ఇద్దామని నిర్మాణ సంస్థ భావిస్తోందట. కానీ కంగనా మాత్రం అందుకు తిరస్కరించిందట.
దర్శకురాలిగా తనకు క్రెడిట్ వద్దని.. క్రిష్ ఒక్కడి పేరే వేయాలని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంతకీ ఈ వ్యవహారంపై మన క్రిష్ స్పందన ఏమిటో చూడాలి. ఆ సినిమా గురించి మాట్లాడ్డానికే క్రిష్ ఇష్టపడట్లేదు. విడుదలకు ముందు అతను ప్రమోషన్లకు వెళ్తాడా.. మార్పులు చేర్పులపై ఏమైనా మాట్లాడతాడా అన్నది ఆసక్తికరం. ఝాన్సీ లక్ష్మీబాయి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.రాజమౌళి తండ్రి, ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టు అందించారు. ఐతే ఆయన రాసిన స్క్రిప్టులో కంగన తన టీంతో కలిసి చాలా మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు.