రేపు ఎన్టీఆర్ కథానాయకుడు వస్తున్నాడు. థియేటర్లు సిద్ధంగా ఉంచారు. వందకు పైగా సినిమా హాళ్లలో ఏకంగా విగ్రహాలు పెట్టేసారు. పూజలు అభిషేకాలు చేసినా ఆశ్చర్యం లేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న అధికార పార్టీ వ్యవస్థాపకుడి సినిమా కావడంతో మాములు కంటే హడావిడి ఓ రెండు పాలు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఫైనల్ గా కథానాయకుడు మెప్పించేలా ఉంటాడా లేదా అనే దాని గురించి అనుమానాలు అయితే తొలగిపోవడం లేదు. ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్ లో ఎన్టీఆర్ పాత గెటప్స్ లో బాలకృష్ణను చూపించడం వివిధ పాత్రలు వేసిన వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయించి క్రిష్ బాలయ్యల గొప్పదనం వివరించడంలాంటివి తప్ప నిజంగా ఇందులో ఎమోషనల్ కంటెంట్ ఎంత మేరకు ఉందనే విషయంలో ఒక అభిప్రాయాన్ని కలిగించలేకపోయారు.
క్రిష్ దీన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేయడం చూస్తే ఎంతమేరకు ఆశించిన అవుట్ పుట్ వచ్చి ఉంటుంది అనే అనుమానాలు రాకపోలేదు. గౌతమిపుత్రశాతకర్ణి విషయంలోనూ ఇదే దూకుడు చూపించిన క్రిష్ కథా పరంగా సరైన కసరత్తు లేకుండానే కేవలం యుద్ధ సన్నివేశాలు భారీతనం తో పాస్ అయిపోయాడు. చరిత్ర పూర్తిగా అందుబాటులో లేకపోయినా అలా చుట్టేసామని స్వయానా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో తనే ఒప్పుకున్నాడు. కొంపతీసి ఎన్టీఆర్ కూడా అదే బాపతులో రాలేదు కదా అనే అనుమానాలు ఉన్నాయి.
ఎందుకంటే చంద్రబాబు ఇమేజ్ కు భంగం కలిగించకుండా ఎన్టీఆర్ జీవితంలో చేదు సంఘటనలను హై లైట్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. మరి ఇన్ని పరిమితుల మధ్య క్రిష్ నిజాయితిగా నిజాలు చూపించడం జరగని పని. అదే కనక నిజమైతే విమర్శలు రావడం తద్యం.ట్రైలర్ లో చూపించిన దానికి పదింతలు కంటెంట్ రేపు తెరమీద కనిపిస్తేనే అభిమానుల సంగతి కాదు కాని సామాన్య జనం మెచ్చుతారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా ఇబ్బందులు తప్పవు.
Full View