మనకు తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఫిలింమేకర్స్ లో క్రిష్ ఒకరు. కమర్షియల్ ఫార్మాట్ అంటూ రొటీన్ స్టొరీల వెంట పరుగులు పెట్టకుండా మంచి అభిరుచి కలిగిన సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పేరే తెచ్చుకున్నాడు. హిందీ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'మణికర్ణిక' సినిమాకు దర్శకుడు క్రిష్. కానీ మెజారిటీ షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా నుండి బయటకు వచ్చి నందమూరి బాలకృష్ణ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ ను టేకప్ చేశాడు. క్రిష్ నిష్క్రమణ తర్వాత కంగన 'మణికర్ణిక' దర్శకత్వ బాధ్యతలను స్వీకరించింది.
నిర్మాతలు మాత్రం దర్శకుడు క్రిష్ అనే అంటున్నారు. టైటిల్ క్రెడిట్ కూడా క్రిష్ కే ఇచ్చారు. కానీ ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'మణికర్ణిక' చిత్రానికి టైటిల్ క్రెడిట్ తీసుకోవడంపై క్రిష్ పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ అదే నిజమైతే 'మణికర్ణిక' సినిమా టైటిల్స్ లో డైరెక్టర్ గా కంగన పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా 'మణికర్ణిక' చిత్రానికి టైటిల్ క్రెడిట్ తీసుకోకపోయినా క్రిష్ కు వచ్చే నష్టమేమీ లేదు. హిందీలో ఇప్పటికే అక్షయ్ కుమార్ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. తెలుగు వరకూ తీసుకుంటే మణికర్ణిక తో క్రిష్ కు వచ్చే కొత్త గుర్తింపు ఏమీ ఉండదు.
ఇదిలా ఉంటే క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. క్రిష్ ఎంట్రీ తర్వాత ఈ ప్రాజెక్ట్ రేంజే పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి.