ఆ విమ‌ర్శ‌ల‌పై క్రిష్ ఘాటుగా స్పందించాడు

Update: 2017-01-16 15:43 GMT
చారిత్ర‌క సినిమాలు తెర‌కెక్కిన‌పుడు క‌థ‌ను వ‌క్రీక‌రించారంటూ ఆరోప‌ణ‌లు స‌హ‌జ‌మే. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ కూడా ప్ర‌స్తుతం అలాంటి వివాదాన్నే ఎదుర్కొంటోంది. పాండురంగారెడ్డి అనే చరిత్రకారుడు ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీసిన క్రిష్.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శాతకర్ణి తెలుగువాడు కాద‌ని.. అత‌ను కోటి లింగాల్లో పుట్టలేదని.. ఆయన తల్లి గౌతమి ఆనవాళ్లు మహారాష్ట్రలో ఉన్నాయని.. శాతకర్ణి కుమారుడు పులోమావి విధిలేని పరిస్థితుల్లో అమరావతికి వచ్చాడని ఆయన అన్నారు. దీనిపై క్రిష్ వెంట‌నే స్పందించాడు. శాత‌క‌ర్ణి విష‌యంలో త‌న వెర్ష‌న్ చెప్పాడు.

‘‘శాత‌క‌ర్ణి గురించి మాకు చాలా త‌క్కువ స‌మాచారం ల‌భించింది. 5 పుస్త‌కాలు చ‌దివితే అందులో 10 డిఫ‌రెంట్ వెర్సెన్స్ ఉన్నాయి. నేను చిన్న‌ప్పుడు చ‌దువుకున్న క‌థ.. నాకు ల‌భించిన స‌మాచారం అంతా క‌లిపి క‌థ‌గా త‌యారు చేశాం. ఐతే కొంత మంది శాత‌క‌ర్ణి తెలుగు వాడే కాదు అంటున్నారు. నేను దీని గురించి చ‌ర్చ పెట్ట‌ద‌ల‌చుకోలేదు. అలా అయితే విశ్వ‌నాధ స‌త్య‌నారాయ‌ణ శాస్ర్తి గారు చెప్పింది త‌ప్పంటారా? ప‌ర‌బ్ర‌హ్మ శాస్త్రి గారు చెప్పింది త‌ప్పు అంటారా?   ఎన్టీఆర్ ఈ సినిమా చేయాలి అనుకున్నారు. మ‌రి శాత‌క‌ర్ణి తెలుగువాడు కాక‌పోతే ఆయ‌న ఎందుకు ఈ సినిమా చేయాల‌ని అంతగా త‌పించి ఉంటారు? ఇవన్నీ తెలుసుకోకుండా విమ‌ర్శ‌లు చేస్తుంటే బాధగా ఉంటుంది. ఏమీ తెలుసుకోకుండా సినిమా తీసేంత పిచ్చివాడిని కాదు నేను’’ అని క్రిష్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News