వివాదాలు ఎప్పుడూ నటీనటులకు ఇబ్బందికరం. అందునా కోట్లాది రూపాయల పెట్టుబడులతో ముడిపడి ఉండే రంగుల ప్రపంచంలో వివాదాస్పదులకు అవకాశాలు రావడం కష్టం. ఎంపికైనా సినిమాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు నుంచి జాక్విలిన్ ని తొలగించి నర్గీస్ ఫక్రీకి అవకాశం ఇచ్చారని టాక్ వినిపించింది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. జాకీ రకరకాల వివాదాల్లో చిక్కుకుంది. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్విలిన్ ఈడీ విచారణను ఎదుర్కొంటోంది. ఆ క్రమంలోనే తనతో షూటింగ కి ఇబ్బంది కలుగుతుందని భావించి మేకర్స్ తొలగించారని టాక్ వినిపించింది.
కానీ ఇది నిజం కాదు అంటూ క్రిష్ పెద్ద షాకిచ్చారు. అసలు సదరు వివాదాస్పద నటి మా సినిమాలో నటించనే లేదనేసారు. బాలీవుడ్ మీడియాతో అసలు జాకీని ఎంపిక చేయలేదని కూడా అనడంతో ఇప్పుడు అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇన్ని రోజులుగా జాక్విలిన్ ఈ చిత్రంలో యువరాణి పాత్రలో నటిస్తోందని టాక్ వినిపించింది. నిధి అగర్వాల్ తో పాటు తను కీలక పాత్రధారి అన్న బజ్ ఉంది. అయితే ఇలాంటి వార్తలను క్రిష్ ఏనాడూ కొట్టి పారేయలేదు. కానీ సడెన్ గా ఆయన మాట మార్చారు. బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలను సద్దుమణిగేలా చేసేందుకు అతడు తెలివైన సమాధానం వెతికారని ఇప్పుడు అంతా భావిస్తున్నారు. వివాదాలకు చెక్ పెట్టేందుకు అతడు అలా చెప్పాడు! అన్న టాక్ వినిపిస్తోంది. చిన్న ట్విస్టుతో పెద్ద వివాదానికి చెక్ పెట్టడం తెలివైన పనే..
జాక్విలిన్ పై ఆరోపణలు ఇవీ..
200 కోట్ల స్కామ్ స్టర్ సుకేష్ ట్రాప్ లో పడిన జాక్విలిన్ కి ఏకంగా 10కోట్ల మేర ముట్టిందని ఈడీ విచారణలో నిగ్గు తేలింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ -ఆమె కుటుంబ సభ్యులు బిఎమ్‌డబ్ల్యూ- పోర్షే కార్లను సుకేష్ నుంచి అందుకున్నారు. ఖరీదైన ఆభరణాలను కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి అందుకున్నారని ఈడీ ఛార్జిషీట్ లో పేర్కొంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆమె కుటుంబ సభ్యులు బిఎమ్ డబ్ల్యూ- పోర్షే కార్లతో పాటు ఖరీదైన ఆభరణాలను కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి అందుకున్నారని ఈడీ ఛార్జిషీట్ లో పేర్కొంది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్ ను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్ లో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని పరిచయం చేసుకునేందుకు తనను తాను శేఖర్ రత్న వేలగా పరిచయం చేసుకున్నాడని పేర్కొంది. డిసెంబర్ 2020లో ఆమెతో టచ్ లో ఉండటానికి అతను చేసిన మొదటి ప్రయత్నంలో అతను విఫలమైన తర్వాత.. జనవరి 2021లో ఆమె మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ ద్వారా అతను జాకీని సంప్రదించినట్లు ఏజెన్సీ వెల్లడించింది. షాన్ కి తాను ప్రభుత్వ అధికారిని అని చెప్పుకునే వ్యక్తి నుండి కాల్ వచ్చిందట. `చాలా ముఖ్యమైన వ్యక్తి` అయిన శేఖర్ రత్న వేలు జాకీని తప్పనిసరిగా సంప్రదించాలని కోరాడట. ఏజెన్సీకి వెల్లడించిన వివరాలలో జాకీ తనకు రెండు జతల డైమండ్ చెవిపోగులు.. రెండు హెర్మేస్ బ్రాస్ లెట్ లు.. మూడు బిర్కిన్ బ్యాగ్ లు.. గూచీ దుస్తులు,.. బహుళ వర్ణ రాళ్ల బ్రాస్ లెట్ .. ఒక జత లూయిస్ విట్టన్ షూస్ వంటి బహుమతులు అందుకున్నట్లు పేర్కొంది. మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 15 జతల చెవిపోగులు.. ఐదు బిర్కిన్ బ్యాగులు..ఇతర విలాసవంతమైన వస్తువులను ఇచ్చినట్లు చంద్రశేఖర్ తన ప్రకటనలో ఓపెన్ గా వెల్లడించాడు. తాను నటి కార్టియర్ కి బ్యాంగిల్స్ - ఉంగరాలు - రోలెక్స్ వాచీలతో పాటు టిఫనీ & కో ఒక బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇచ్చానని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నటుడికి కేవలం రూ. 7 కోట్ల విలువైన బహుమతులను ఆభరణాల రూపంలో ఇచ్చానని ఆమెకు `ఎస్పూలా` అనే గుర్రాన్ని బహుమతిగా ఇచ్చానని చెప్పాడు.