అమ్మ నవ్వింది.. క్రిష్ కవిత రాశాడండోయ్

Update: 2016-05-09 07:17 GMT
జాగర్లమూడి రాధాకృష్ణ మంచి దర్శకుడే కాదు.. రచయిత కూడా. మాతృదినోత్సవం సందర్భంగా అతను తన పెన్ పవర్ చూపించాడు.తన తల్లి గొప్పదనాన్ని చాటుతూ.. ‘అమ్మ నవ్వింది’ పేరుతో ఓ చిన్న కవిత రాశాడు.

‘‘మా అమ్మ నవ్వింది..

నీకు నేను జీవితాన్నిస్తే

అందులోంచి ఏడాదికో రోజు నాకిస్తున్నావా అనీ,

నీ ప్రతీ రోజూ నాదేరా పిచ్చిసన్నాసి అని..

దగ్గర లేనని బాధ పడుతుంటే మళ్లీ నవ్వింది..

అమ్మ విలువ చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి

షూటిం కోసం దూరంగా మొరాకోలో ఉన్నావుగా..

అమ్మలందరి దగ్గర నువ్వున్నట్లే అని..

నాకు నవ్వొచ్చింది..

కాదు

మా అమ్మ నవ్వించింది’’

ఇదీ క్రిష్ కవిత సాగిన తీరు. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కదా. ఈ కవిత ద్వారా తాను ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం మొరాకోలో ఉన్న సంగతి చెప్పకనే చెప్పేశాడు క్రిష్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే ఆరంభం కాబోతోంది. సినిమాకు ఎంతో కీలకం అయిన వార్ సీక్వెన్స్‌ అక్కడ చిత్రీకరించబోతున్నారు. దీని కోసం రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ వందో సినిమాను క్రిష్ సొంత సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. క్రిష్ ఆస్థాన రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తాడు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ప్రణాళికతో ఉంది క్రిష్ అండ్ కో.
Tags:    

Similar News