లిప్ లాక్ మూవీని ఓటీటీలోకి తోసేస్తార‌ట‌

Update: 2020-05-08 06:00 GMT
సినిమా కంటెంట్ వేరు.. ఓటీటీ కంటెంట్ వేరు. థియేట్రిక‌ల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలంటే అందుకు త‌గ్గ‌ట్టు క‌థ‌ల్లో కంటెంట్ డిఫ‌రెంటుగా ఉండాలి. దానికి తోడు బ‌డ్జెట్ల ప‌ర‌మైన డిఫ‌రెన్స్ కూడా పెద్ద‌దే. ఇక లాక్ డౌన్ వేళ థియేటర్లు మూత‌ప‌డ్డాక‌.. ఓటీటీ పేరు మార్మోగిపోతోంది. మునుముందు పెద్ద సినిమా లేదా ఓటీటీ సినిమా మాత్ర‌మే మిగులుతాయ‌న్న చ‌ర్చా ఇప్ప‌టికే వేడెక్కిస్తోంది.

అదంతా అటుంచితే .. ఇన్నాళ్లు ల్యాబుల్లో దాగి ఉన్న వాటిని అగ్ర నిర్మాత‌లంతా ఓటీటీలో తోసేస్తున్న సంగ‌తి తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు త‌న‌వ‌ద్ద ఉన్న స్టాక్ ని క్లియ‌ర్ చేస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. ఇప్పుడు మ‌రో అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు సైతం త‌న‌వ‌ద్ద ల్యాబుల్లో మ‌గ్గుతున్న ఓ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత‌కు లైన్ క్లియ‌ర్ చేస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఏ సినిమా అది? అంటే..

గుంటూరు టాకీస్ ఫేం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌.. జెర్సీ ఫేం శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ జంట‌గా తెర‌కెక్కిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `కృష్ణ అండ్ హిజ్ లీలా`. ఇందులో ర‌న్ రాజా ర‌న్ ఫేం సీర‌త్ క‌పూర్ ఓ వేడెక్కించే రోల్ పోషించింది. ఇందులో క‌థానాయిక‌ల‌తో గుంటూర్ టాకీస్ త‌ర‌హాలో వేడెక్కించే స‌న్నివేశాలు అడుగ‌డుగునా క‌నిపిస్తాయ‌ట‌. లిప్ లాక్ ల‌కు అయితే కొద‌వే లేద‌న్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ మూవీని ఓటీటీకి వ‌దిలేయాల‌న్నది సురేష్ బాబు ఆలోచ‌న అని తెలిసింది. ఈ చిత్రానికి ర‌వికాంత్ పారేపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2016లోనే రిలీజ్ కావాల్సింది ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ల్యాబుకే అంకిత‌మైపోయింది ఈ మూవీ. ఎట్ట‌కేల‌కు ఓటీటీ కి డిమాండ్ పెరిగింది కాబ‌ట్టి ఇప్పుడు ఇక్క‌డ రిలీజ్ చేసేస్తే ఓ ప‌నైపోతుంద‌ని భావిస్తున్నార‌ట‌. `కృష్ణ అండ్ హిజ్ లీలా` ఓటీటీలో వ‌స్తుందా రాదా? అన్న‌దానిపై సురేష్ బాబు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఇటీవ‌ల రిలీజ్ ల‌కు రావాల్సిన చాలా చిన్న సినిమాలు లాక్ డౌన్ వ‌ల్ల‌ రాలేదు. అవి కూడా ఓటీటీలోకే రిలీజ్ చేస్తార‌ని భావిస్తున్నా వాటికి సంబంధించిన క్లారిటీ రాలేదింకా.
Tags:    

Similar News