ఓ ఐదు సంవత్సారాల క్రితం సరైనోడు సినిమాతో పలకరించిన సక్సెస్.. ఇప్పుడు మాత్రం మొహం చాటేసింది. ఏళ్ళ తరబడి ఎలాంటి కథలు పైకెత్తుకున్నా కూడా విజయ పరంపర మాత్రం వినిపించట్లేదు. అవును.. అల్లరి నరేష్ గురించే ఈ ఇంట్రొడక్షన్ అంతా. అయితే మనోడు ప్రస్తుతం రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఆ రెండింటిలో ఒక్కటి క్లిక్ అయినా కూడా మాంచి హిట్టు కొట్టేయవచ్చు.
ఆల్రెడీ జి.నాగేశ్వరరెడ్డి డైరక్షన్ లో 'ఇంట్లో దెయ్యం.. నాకేంటి భయం' అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. అంటే ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్టే అనమాట. అబ్బే మొన్ననే నాగేశ్వరరెడ్డి ఈడోరకం ఆడోరకం తీశాడని కాదు.. అలా అనుకుంటే ఆయన సుశాంత్ తో తీసిన ఆటాడుకుందాం.. రా.. ఆగిపోయిందిగా. నిజానికి ఈ సినిమా ఎప్పుడైతే దెయ్యం కామెడీ అని టైటిల్ చెబుతోందో అప్పుడే హిట్టు అని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కామెడీగా తీసిన ఏ దెయ్యం కథైనా కూడా ఫ్లాపైన దాకలాలు లేవు.
ఇకపోతే నరేష్ తదుపరి సినిమా కోసం అలా ఎలా సినిమాను తీసిన అనీల్ కృష్ణ లైన్లోకి వచ్చాడు. అసలు ట్విస్టు ఏంటంటే.. ఈ సినిమాకు కథ అండ్ మాటలు అందిస్తోంది ఎవరో కాదు.. మన కమెడియన్ కృష్ణ భగవాన్. వృత్తిరిత్యా మనోడు రైటర్ కాబట్టి.. ఈ కథను మాటలను అదరగొట్టేస్తున్నాడట. అందుకే ఈ రెండు సినిమాలూ నరేష్ కు హిట్టిచ్చే మాంచి ఆప్షన్లు.