మెగాస్టార్ చిరంజీవితో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా కల ఇంకా నెరవేరని సంగతి తెలిసిందే. చిరుతో చేయాల్సిన `ఆటోజానీ` మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిరు మరోసారి ఆఫర్ ఇచ్చారు. ఆటోజానీ పూర్తి కథ సిద్దం చేస్తారా? లేదా? మరో కొత్త కథతో అప్రోచ్ అవుతారా? అన్నది మీ ఇష్టం..నేను రెడీ అంటూ పూరితో ఇంటరాక్షన్ టైమ్ లో గేట్లు ఎత్తేసారు చిరంజీవి.
కానీ పూరి మాత్రం ఇంకా సిద్దంగా కనిపించలేదు. అన్నయ్య తో సినిమా అంటే ఆషామాషీ కాదు.. ఆయన ఇమేజ్ కి త్గ కథ సిద్దం చేయాలని కొన్నినెలలుగా కుస్తీలు పడుతూనే ఉన్నారు.
తాజాగా ఇటీవలే మెగాస్టార్ మరో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి కూడా ఆఫర్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. `రంగమార్తాండ` ప్రమోషన్ లో భాగంగా `మీలాంటి దర్శకులు మీకు సరైన కథ దొరికే వరకు నన్ను సంప్రదించరు.
కానీ మీరు ఒక అడుగు ముందుకు వేస్తే కథలు ఆటోమేటిక్‌గా వస్తాయి. నేను మీ దర్శకత్వంలో పని చేయాలనుకుంటున్నాను` అని చిరంజీవి దర్శకుడితో తన ఇంటరాక్షన్ సందర్భంగా అన్నారు. ఇలా ఇద్దరికి చిరంజీవి ఆఫర్ ఇచ్చి రెడీగా ఉన్నారు. కానీ ఇద్దరి వద్ద కథలు రెడీగా లేవు. మరి చిరు పిలుపు ఆ ఇద్దరిలో మార్పు తీసుకొస్తుందా? అన్నది చూడాలి.
అయితే ఆ ఇద్దరికి ఇది ఓ కౌంట్ డౌన్ గానే చెప్పాలి. చిరంజీవిని కథతో మెప్పించ గల్గితే మరో ఆలోచన లేకుండా అన్నయ్య సినిమా చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ వీళ్లిద్దరు ఇప్పటికప్పుడు కథలు సిద్దం చేస్తారా? అన్నది సందేహమే. ఇద్దరు రాంగోల్ వర్మ ప్రియు శిష్యులు. వర్మ కాంపౌండ్ లో పాఠాలు నేర్చుకున్న ఉద్దండులు.
ఇండస్ర్టీకి ఎలాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు అంతకంతకు విమర్శించ దగ్గ ఫెయిల్యూర్స్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఫెయిల్యూర్స్ లోనే ఉన్నారు. అయినా సరే చిరంజీవి వాళ్లిద్దరితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ ఇద్దరే ఉన్నారా? లేరా? అన్నది తెలియాలి.