క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంటుగా పని చేసే సమయంలో చాలామంది బాలీవుడ్ నటీనటులు.. సాంకేతిక నిపుణులతో పరిచయముంది. అందుకే అప్పుడప్పుడూ అక్కడి నటీనటుల్ని.. సాంకేతిక నిపుణుల్ని తన సినిమా కోసం తీసుకొస్తుంటాడు. సోనాలి బింద్రే.. సందీప్ చౌతా లాంటి వాళ్లను తెలుగు తెరకు పరిచయం చేసింది కృష్ణవంశీ. ‘దౌడ్’ సినిమాకు పని చేసినప్పటి పరిచయంతో సంజయ్ దత్ సైతం కృష్ణవంశీ తెలుగులో తీసిన ‘చంద్రలేఖ’లోనూ చిన్న క్యామియో రోల్ చేశాడు. ఇప్పుడు తెలుగులో మరో కీలకమైన పాత్రను సంజయ్ దత్ తో చేయించాలని కృష్ణవంశీ ఆశపడ్డాడట. ఐతే కొన్ని కారణాల వల్ల కుదరలేదట.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘నక్షత్రం’లో సాయిధరమ్ తేజ్ చేసిన క్యారెక్టర్ సంజయ్ దత్ ను దృష్టిలో పెట్టుకునే రాశాడట కృష్ణవంశీ. కానీ అనుకోకుండా ఆ పాత్రలోకి సాయిధరమ్ తజ్ వచ్చాడని కృష్ణవంశీ తెలిపాడు. ముందు తాను అనుకున్న ప్రకారం అది మిడిలేజ్డ్ క్యారెక్టర్ అని.. సంజయ్ దత్ ఆ పాత్ర చేస్తే బాగుంటుందనుకున్నానని.. సంజూ అయితే ఆ పాత్ర డీఎస్పీగా ఉండేదని.. ఐతే అనుకోకుండా ఒక పార్టీలో సాయిధరమ్ ను కలవడం.. తర్వాత అతనే ఈ పాత్రలోకి రావడం.. తన కోసం పాత్రను మార్చి యంగ్ పోలీస్ గా మార్చడం జరిగిందని కృష్ణవంశీ వెల్లడించాడు. ఈ పాత్ర చేయడానికి సాయిధరమ్ సంతోషంగా ఒప్పుకోవడమే కాక.. ఉచితంగా పని చేశాడని కృష్ణవంశీ వెల్లడించాడు. కానీ గత ఏడాది సంజయ్ దత్ జైల్లో ఉండగా.. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణవంశీ ఈ పాత్ర ఎలా రాశాడన్నదే అర్థం కాని విషయం.