కృష్ణవంశీ గారు ఇప్పుడైనా హిట్ ఇస్తారా?

Update: 2017-10-24 11:14 GMT
దర్శకుడిగా మొదటి ఛాన్స్ వస్తేనే అదృష్టవంతుడిని చెప్పాలి. అదే విధంగా ఆ చాన్సుతో మరికొన్ని అవకాశాలను దక్కించుకోవాలి అన్నా కూడా మరింత అదృష్టం ఉండాలి. లేకుంటే మధ్యలో ఏ మాత్రం తడబడినా మళ్లీ ఛాన్సులు రావడం కష్టమే. అయితే కొంత మంది సీనియర్ దర్శకులు మాత్రం ఎన్ని అపజయాలు వస్తున్నా కూడా ఇంకా పట్టు విడవని విక్రమార్కుల లాగా సినిమాలను తీస్తున్నారు. ఆ తరహాలో ప్రస్తుతం సినిమాలను చేస్తున్న దర్శకుడు కృష్ణ వంశీ.

ఒకప్పుడు హిట్టు సినిమాలను అందుకున్న దర్శకుడే. కొత్త తరహా కథలను కూడా బాగానే తీశాడు. యాక్షన్ - థ్రిల్లర్  - రొమాన్స్ అలాగే సామాజిక అంశాలతో కూడిన సినిమాలతో పాటు దేశభక్తి సినిమాలను కూడా తీశాడు. ఈ ఫార్మాట్  అన్నిటిలో వంశీ గారు హిట్స్ అందుకున్నారు. కానీ గత కొంత కాలంగా ఆయనను అపజయాలు చాలా పలకరిస్తున్నాయి. ఇంటెన్సిటీ పేరుతో థియేటర్లలో చెవులు దద్దరిల్లేలా అరిపించడం ఆయన దర్శకత్వపు శైలి. మేకింగ్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. తప్పులేదు. కానీ ఆడియెన్స్ మారారు. కృష్ణ వంశీ ప్రతి సారి అదే ఫార్మాట్ లో సినిమాను తీస్తుంటే బోరింగ్ అని ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా వచ్చిన నక్షత్రం కూడా దాదాపు అదే స్టైల్ లో ఉంది.

అయితే ఇప్పుడు కృష్ణ వంశీ - గోపీచంద్ తో మరో సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. వీరి కలయికలో ఇంతకుముందు మొగుడు సినిమా వచ్చింది. ఆ సినిమా గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. గోపి కూడా నెక్స్ట్ ఈ సినిమాలకు కమిట్ అవ్వలేదు. అంతే కాకుండా కొంచెం అపజయాలతో సతమతమవుతున్నాడు. మరి కృష్ణ వంశీ ఈ సారైనా కొంచెం కొత్తగా ట్రై చేస్తాడో లేదో..?
Tags:    

Similar News