కరోనా వల్ల చిన్న పెద్ద సినిమాలు పదుల కొద్దీ రెండేళ్ల నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది చివరి నుంచి సినిమాలు విడుదల అవ్వడం మొదలు అయ్యింది. ఈ ఏడాదిలో మళ్లీ కాస్త ఇబ్బంది కలిగిన మార్చి నుంచి సినిమాల జాతర మొదలు అయ్యింది. దాంతో వారం కు రెండు మూడు మీడియం చిన్న రేంజ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. పెద్ద సినిమాలు ఉంటే ఒక్కటి చొప్పున విడుదల అవుతున్నాయి.
పెద్ద హీరోల సినిమాలు విడుదల అయిన తర్వాత వారం చిన్న హీరోలకు పెద్దగా స్కోప్ ఉండదు. ఒక వేళ పెద్ద హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతే అప్పుడు ఆ తదుపరి వారం చిన్న సినిమాలు వచ్చినా.. మీడియం రేంజ్ సినిమాలు వచ్చినా నెట్టుకు రాగలవు. ఈ వారం వచ్చిన సర్కారు వారి పాట సినిమా ఆశించిన స్థాయిలో లేదు అనేది కొందరి అభిప్రాయం.
సర్కారు వారి పాట ఫలితం నేపథ్యంలో వచ్చే వారం చిన్న సినిమాలు విడుదల అయిన పెద్దగా నష్టం లేదు అనేది కొందరి అభిప్రాయం. అందుకే మే 20వ తారీకున వచ్చే సినిమాల గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మే 20వ తారీకున కృష్ణ వ్రింద విహారి సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కాని ఆ సినిమా విడుదల కావడం లేదని తెలుస్తోంది.
నాగ శౌర్య హీరోగా నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమాకు మంచి బజ్ ఉంది. ఇటీవలే విడుదల అయిన పోస్టర్ మరియు టీజర్ కు మంచి స్పందన రావడంతో అనూహ్యంగా సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. దాంతో మే 20వ తారీకున సినిమా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. మహేష్ బాబు సినిమా జోరు మే 20 వరకు కాస్త తగ్గే అవకాశం ఉంది కనుక ఆ తేదీన విడుదల అయితే పాజిటివ్ గా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.
మే 20వ తారీకున పెద్దగా పోటీ లేక పోవడంతో పాటు ఇప్పటికే విడుదల అయిన సినిమాల నుండి కూడా పోటీ లేకపోవడం వల్ల ఖచ్చితంగా కృష్ణ వ్రింద విహారి సినిమా కు కలిసి వస్తుందని భావించారు. కాని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వలేదు అంటూ విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
మంచి డేట్ ను మిస్ చేసుకున్న యంగ్ హీరో నాగ శౌర్య కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆగస్టు వరకు వరుసగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉండటం వల్ల నాగ శౌర్య ఎప్పుడు తన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.