తీన్ మార్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా నటించిన కృతి కర్బందా.. బ్రూస్ లీ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అక్కగా కనిపించింది. తమిళ బ్రూస్ లీకి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈమె.. ప్రస్తుతం రాజ్ రీబూట్ తో బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతోంది. సౌత్ లో ఉన్నంత వరకూ హోమ్లీ కేరక్టర్లలో కనిపించిన కృతి.. ఇప్పుడు తొలి ముద్దు అనుభవాలను గురించి పంచుకుంటోంది.
బాలీవుడ్ లో ఈ మధ్య ముద్దు సన్నివేశాలు బాగా కామన్ అయిపోయాయి. పైగా ఇమ్రాన్ హష్మి సినిమాలంటే ముద్దు సీన్లకు స్పెషల్ అనే విషయం ఆడియన్స్ కు బాగానే తెలుసుంది. మరి అతగాడితో కిస్సింగ్ సీన్లతో నటించక తప్పని పరిస్థితి కృతికి వచ్చింది. బాలీవుడ్ కోసం ముద్దు సీన్లతో నటించిన ఈమె.. తన ఫస్ట్ కిస్ ఇమ్రాన్ హష్మీకే ఇచ్చానంటోంది. 'నా తొలిముద్దు ఇమ్రాన్ హష్మి కే ఇచ్చాను. ఆ టైంలో నాకు చాలా భయమేసింది. ఇప్పటివరకూ ముద్దు అనుభవం లేని నేను.. ఆ సీన్ లో ఎలా యాక్ట్ చేయగలనని భయపడ్డాను. ఆ సమయంలో చాలా ఇబ్బందికి గురయ్యాను కూడా. ముద్దు సీన్ లో నటించడం కష్టంగా అనిపించింది.' అని చెప్పింది కృతి కర్బందా.
మొదట రాజ్ రీబూట్ లో నటిస్తున్నప్పుడు చాలా డౌట్స్ ఉండేవని... సౌత్ లో అన్నీ మంచి రోల్స్ లో కనిపిస్తే.. ‘రాజ్ రీబూట్’ లో అందుకు పూర్తి భిన్నమైన పాత్ర పోషించానని చెప్పిందీ భామ. ఈ మూవీలో భర్త ఉండగానే.. మాజీ లవర్ ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. పైగా ఆన్ స్క్రీన్ పై కిస్సింగ్ సీన్స్ అదనం. అయితే.. సినిమా పూర్తయ్యేసరికి మాత్రం బాగా ధైర్యం వచ్చేసిందట. బాలీవుడ్ కోసం స్పెషల్ గా ప్రిపేర్ అయిపోవాల్సిన పనేమీ లేదని చెప్పింది కృతి కర్బందా.