బ్రేక్ ద రూల్స్ అంటున్న మహేష్ హీరోయిన్!

Update: 2016-12-20 12:33 GMT
సినిమా ఇండస్ట్రీలో వీలైనంత వరకూ సాఫ్ట్ గా ఉంటూ వచ్చిన అవకాశాలను సక్రమంగా వాడుకుంటూ దూసుకుపోవాలని అంటుంటారు. అయితే తాను మాత్రం అలా సాఫ్ట్ గా వెళ్లే మనిషిని కాదు, కాస్త దూకుడెక్కువ, డోంట్ కేర్ యాటీట్యూడ్ పుష్కలంగా ఉంది అని చెబుతుంది కృతి సనన్! మహేష్‌ బాబు‌తో "1 నేనొక్కడినే"లో ప్రిన్స్‌ ని ఆటపట్టించి.. ఒక రోజు పండగ చేసి బ్రేక్ అప్ అయిపోమని డామినేషన్ పాత్రలో నటించి మెప్పించిన కృతి సనన్, ఆ తర్వాత చైతుతో "దోచెయ్" మూవీలో కాస్త ఘాటైన పాత్రలోనే నటించింది. ఆ మూవీలో పబ్లిక్‌ గా స్మోక్ చేస్తూ డోంట్ కేర్ యాటిట్యూడ్ చూపించిన కృతిసనన్ అనంతరం టాలీవుడ్‌ కి టాటా చెప్పేసి బాలీవుడ్ కి చేరింది. అయితే ఈమెకున్న హైటో - అందమో - ఫెర్మారెమెన్స్ కారణమో కానీ అక్కడ మంచి ఆఫర్లే సంపాదించుకోగలిగింది!

అయితే టాలీవుడ్ లో వచ్చిన ఆమె సినిమాల్లోని పాత్రల మాదిరిగానే ఆఫ్ స్క్రీన్‌ లో కూడా తనది డోంట్ కేర్ యాటిట్యూడ్ అని చెబుతుంది కృతి. ఈ విషయంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ ని ఫాలో అవుతానని, విషయం ఏదైనా తన నిర్ణయం సూటిగా ఉంటుందని చెప్పేస్తుంది. బ్రేక్ ద రూల్స్ అని చెబుతూ... కంగనాది కూడా సేమ్ టు సేమ్ క్యారెక్టరే కాబట్టి ఇంప్రెస్ అయ్యానని చెబుతుంది. కాగా ఈ భామ చేతిలో "రాబ్తా", "బార్లీకి బర్ఫీ" అనే సినిమాలు ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News