కాలేజీ బంక్ కొడతా. గోడలెక్కి దూకేస్తా. ఫ్రెండ్సుతో కలిసి శికార్లకు వెళతా. అల్లరి చిల్లరగా ఉంటా.. ఇది నా పాత్ర స్వభావం.. అంటూ చెప్పుకొచ్చింది కృతిసనోన్. 1 నేనొక్కడినే తర్వాత ఈ భామ నటిస్తున్న సినిమా 'దోచెయ్'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. నాగచైతన్య హీరో. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతూనే కృతి చాలా సంగతులే చెప్పింది.
ఆ విషయాలు తన మాటల్లోనే... ఈ చిత్రంలో నేను ధరించే దుస్తుల నుంచి ప్రతిదీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నా తొలి హిందీ సినిమా 'హీరో పాంటీ'తో పోలిస్తే ఇందులో ఓ విభిన్నమైన పాత్రలో నటించా. 1నేనొక్కడినే చిత్రంలోని పాత్రతోనూ ఏ పోలికా ఉండదు. ఇందులో ఓ కాలేజీ అమ్మాయిగా, అన్ని వేళలా ఫన్ కోరుకునే అమ్మాయిగా కనిపిస్తాను. కాలేజీకి వెళ్లాలంటే బోర్ ఫీలయ్యే అమ్మాయిగా కనిపిస్తాను. అలాగే నా కోస్టార్ నాగచైతన్య చిలౌట్ గయ్. చాలా సరదాసరదాగా గడిపేస్తాడు. ఆన్ స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ సరదాగా ఉండే కుర్రాడు. టాలీవుడ్‌లోనే పేరున్న కుటుంబం నుంచి వచ్చిన హీరో సరసన అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిగా ఎలా నెట్టుకొస్తానో అని బెంగ పెట్టుకున్నా. కానీ ఇక్కడ నాకు ఆదరణ చాలా బావుంది అని చెప్పుకొచ్చింది.