ఈ రేంజ్ లో చింపేస్తున్న కృతి సనన్

Update: 2016-12-28 22:30 GMT
అమ్మాయిలు జీన్ ఫ్యాంటులు వేయడం మొదలుపెట్టినప్పటినుంచీ.. నీ జీనూ ఫ్యాంటూ చూసి బుల్లమ్మో అంటూ పాట పాడటం వరకూ.. జీన్ కి అమ్మాయిలకు ఉన్న సంబందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పైగా ఈ జీన్స్ లందు చిరిగిన జీన్స్ వేరయా అన్నట్లు... జీన్ ఫ్యాంటును సరిగ్గా చింపాల్సిన చోట చింపేసుకుని వాడటం మరీ ఫ్యాషన్. ఈ విషయంలో తన ఫ్యాంట్స్ తానే చింపుకుంటూ ఉంటుందట కృతి సనన్.

"1 నేనొక్కడినే" సినిమాలో మహేష్ బాబు సరసన రచ్చ రచ్చ చేసిన కృతి సనన్‌.. తన జీన్స్‌ ని తానే డిజైన్‌ చేసుకోవడాన్ని ఇష్టపడ్తుందట. ఒకపక్క హీరోయిన్ గా చేస్తూన్నా తనకు డిజైనింగ్ చేయడమంటే మహా ఇష్టమని, అందులో భాగంగానే జీన్స్‌ ని చించేయడం, అనంతరం తన ఆలోచనలకు తగ్గట్టుగా వాటిని డిజైన్ చేసుకుంటుంటానని చెప్తుందట. అలా తాను డిజైన్ పేరుతో చించేసుకున్న జీన్స్ తోనే పార్టీలకు అటెండ్ అవ్వడం కృతికి చాలా ఇష్టమట. అలా అని ఆ టాలెంట్ జీన్స్‌ కి మాత్రమే పరిమితం కాదు సుమా... టాప్స్‌ విషయంలోనూ ఇదే పద్ధతిని ఫాలో అవుతుందట కృతి. యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యి ఉండేదానికి అనడం లేదు కానీ... నిజంగానే హీరోయిన్‌ కాకపోయి వుంటే మాత్ర ఖచ్చితంగా డిజైనర్‌ అయ్యి ఉండేదాన్ని అని చెబుతున్న కృతిలో ఇలాంటివి ఇంకా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News