వారసత్వం- ఆఫర్లు.. బాలీవుడ్ లో కొంత కాలంగా ఘాటుగా జరుగుతున్న డిస్కషన్ ఇది. క్వీన్ కంగనాతో ప్రారంభించి దీని గురించి చాలా మందే మాట్లాడారు. కొందరు సున్నితంగా జవాబు చెప్పి ఎస్కేప్ అయ్యారు. మహేష్ బాబు 1నేనొక్కడినే హీరోయిన్ కృతి సనోన్ ఇప్పుడు బాలీవుడ్ లో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెకు కూడా బాలీవుడ్ లో వారసత్వంపై తన అభిప్రాయం చెప్పాల్సి వచ్చింది.
'ఒకవేళ మీకు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. లేక ప్రఖ్యాతి చెందిన ఇంటిపేరు లేకపోయినా జనాలు గుర్తించడం.. మొదటి సినిమాలో నటించే అవకాశం రావడం కొంత కష్టమైన విషయమే' అని చెప్పింది కృతి సనోన్. 'జనాలకు దగ్గరయ్యేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఇందుకోసం కాస్త ఎక్కువ సమయం పట్టింది. అయితే.. హార్డ్ వర్క్ చేయగలిగితే కాలక్రమేణా ఇది మరుగున పడిపోతుంది. సరైన చిత్రాల కోసం ఓపిగ్గా ఎదురుచూడాల్సి ఉంటుంది. నా వరకు నేను మొదట స్క్రిప్ట్ కి ప్రాధాన్యత ఇస్తాను. ఆ తర్వాత నా పాత్ర సంగతి చూస్తాను' అని చెప్పింది కృతి సనోన్.
హీరోపంటి చిత్రంతో అరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత దిల్వాలే చిత్రంలో షారూక్ ఖాన్ తో కలిసి నటించే అవకాసం సంపాదించింది. రీసెంట్ గా రాబ్తా మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం బెరైలీ కీ బర్ఫీలో నటిస్తున్న ఈమె.. ఆదిత్య రాయ్ కపూర్ లో సంతకం చేసిందనే రూమర్స్ ను ఖండించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/