కత్తుల ఫ్యాక్టరీని ఓపెన్ చేసిన క్రిష్

Update: 2016-04-26 04:24 GMT
చారిత్రాత్మక నేపధ్యమున్న సినిమాలు తీయడం కష్టతరమైన పనే. వున్న బడ్జెట్ లో అనుకున్న నిడివిలో విజువల్ ఎఫెక్ట్స్ ఎంతవరకూ వాడాలో తెలుసుకుంటూ అనవసర ఖర్చుని తగ్గించుకుంటూ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. వీటన్నిటిలో ఆరితేరిన రాజమౌళికి ఈ పనులన్నీ ఒక్క సినిమాతో అబ్బలేదు. యమదొంగ - మగధీర - ఈగ - బాహుబలి ఇలా సినిమా సినిమాకు మెరుగుపరుచుకుంటూ తన కెరీర్ ని ఎష్టాబ్లిష్ చేసుకున్నాడు.

అయితే క్రిష్ కు మాత్రం ఒక సినిమాతోనే తన ప్రతిభంతా నిరువుపించుకోవలిసిన అవసరం ఏర్పడింది. బాలయ్య 100వ సినిమా చారిత్రాత్మక వీరుని నేపధ్యంలో తెరకెక్కే చిత్రం కాబట్టి యుద్ధసన్నివేశాలకు కొదవ లేదు. ఈ నేపధ్యంలో బాలయ్యతో పాటూ తక్కిన తారాగణమంతా వాడేందుకు అవసరమైన కత్తులు మరియు ఇతర యుద్ధ పరికరాలను తయారుచేసేందుకు ఒక ఫ్యాక్టరీని స్థాపించినట్టు సమాచారం.

తన సొంత నిర్మాణ సంస్థ కాబట్టి ఖర్చుపెట్టే ప్రతీపైసాకి ఫలితం కనబడాలని కోరుకోవడం సబబే. ఈ చిత్రాన్ని మూడు వారాలపాటూ మొరాకోలో తెరకెక్కించనున్నారు. మే నుండి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి.
Tags:    

Similar News