నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రూలర్' చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జై సింహా చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా దర్శకుడు కేఎస్ రవికుమార్ ను నమ్మి ఈ చిత్రంను బాలయ్య ఆయనకు అప్పగించాడు. ఈ చిత్రం ట్రైలర్ మరియు పోస్టర్స్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతోంది. బాలయ్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడా రెండు పాత్రలా అనే చర్చ జరుగుతోంది.
సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు కేఎస్ రవికుమార్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కెరీర్ ఆరంభం నుండి కూడా ఆఫర్స్ కోసం ఏ హీరో వద్దకు వెళ్లలనేది.. నా వద్దకే ఆఫర్లు వస్తాయంటూ చెప్పుకొచ్చాడు. గతంలో తాను చిరంజీవితో స్నేహం కోసం చిత్రాన్ని చేశాను. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే రజినీకాంత్ కోసం నరసింహా స్క్రిప్ట్ ను రాశానంటూ చెప్పుకొచ్చాడు.
సెట్స్ లో నేను అప్పుడప్పుడు కోపగించుకోవడం జరుగుతుంది. అంతా సవ్యంగా సాగితే ఏం పర్వాలేదు. ఎప్పుడేతై అనుకున్న పని జరగదో అప్పుడే నాకు కోపం వస్తుంది. నేను కోపంలో నా అసిస్టెంట్స్ పై కోప్పడతాను. నాలాగే బాలకృష్ణ గారు కూడా వర్క్ సరిగా అవ్వకుంటే టెంపర్ కు గురి అవుతాడు. ఆయన టెంపర్ తో సెట్ లో అప్పుడప్పుడు కోపగించుకోవడం జరుగుతుంది.
ఆయన వర్క్ సజావుగా సాగితే సరదాగా సెట్ లో ఉంటాడని ఈ సందర్బంగా రవికుమార్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో బాలయ్య ఎన్ని పాత్రలు చేశాడు.. ఇందులో రైతులకు సంబంధించింది ఏంటీ అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.