రజినీ 'రానా' ఇంకా లైన్‌ లోనే ఉన్నాడట

Update: 2021-01-29 05:30 GMT
కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్‌ రజినీకాంత్ హీరోగా లెజెండ్రీ డైరెక్టర్‌ కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో 'రానా' అనే సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆ సందర్బంగానే రజినీకాంత్ అనారోగ్యం పాలవ్వడంతో దాదాపుగా ఏడాది పాటు ఇబ్బందులు పడ్డాడు. రజినీకాంత్ తేరుకున్న తర్వాత రానా సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కాని కొన్ని కారణాల వల్ల రానా సినిమాను పక్కకు పెట్టేశారు. దాంతో రజినీకాంత్‌ రానా సినిమా ఇక లేనట్లే అంటూ తమిళ మీడియా వర్గాల్లో టాక్‌ వచ్చింది. దాదాపుగా పది సంవత్సరాలు అయినా కూడా ఆ ప్రాజెక్ట్‌ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నట్లుగా దర్శకుడు కేఎస్ రవికుమార్‌ చెబుతున్నాడు.

ఇటీవల ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం నేను రానా సినిమాలో మార్పులు చేర్పుల గురించి రజినీకాంత్‌ సర్‌ తో మాట్లాడాను. ఖచ్చితంగా మా ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. అన్నాత్తే సినిమా తర్వాత రజినీకాంత్‌ సినిమా ఏంటీ అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరి ఆ గ్యాప్‌ ను కేఎస్‌ రవికుమార్‌ ఏమైనా భర్తీ చేస్తాడేమో చూడాలి. అనారోగ్యం కారణంగా అన్నాత్తే సినిమాను మద్యలో ఆపేసిన రజినీకాంత్ కాస్త సమయం తీసుకుని ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డ తర్వాత పూర్తి చేసే అవకాశం ఉంది. మరో వైపు రజినీకాంత్‌ రాజకీయాలు ఎలాగూ చేయడం లేదు కనుక ఇకపై ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News