పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా `వకీల్ సాబ్` తరువాత థీయేటర్లలో సందడి చేసి చాలా రోజులవుతోంది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా అని పవన్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర దించుతూ `భీమ్లానాయక్` మేకర్స్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో ఆ కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పెడుతూ `భీమ్లా నాయక్` చిత్రాన్ని ఫిబ్రవరి 25న భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించేశారు.
దీంతో పవన్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలైంది కోవిడ్ కారణంగా పలు దఫాలుగా రిలీజ్ వాయిదా పడుతున్న బాస్ సినిమా వచ్చేస్తుండటంతో అభిమానులు ఫుల్ జోష్ తో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా వుంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తాజాగా షాకింగ్ న్యూస్ అంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 25న ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావడంతో ఈ మూవీ ప్రమోషన్స్ ని భారీగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ నెల 21న భా రీ స్థాయిలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో అత్యంత భారీ స్థాయిలో నిర్వహణకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ వేదిక సాక్షిగా పవన్ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారా? అని ఓ పక్క చర్చ జరుగుతుంటే ..ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథులుగా ఎవరు పాల్గొనబోతున్నారన్నది మరో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా పాల్గొంటారంటూ జోరుగా వార్తలు వినిపించడం మొదలైంది. అయితే తాజా సమాచారం ఏంటంటే `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ లుగా వారు పాల్గొనడం లేదని, ఈ ఈవెంట్ కి గులాబీ నేత, తెరాస యువరాజు కేటీఆర్ రాబోతున్నట్టుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
ఆయన నిజంగానే వస్తున్నారా? .. మేకర్స్ ఆయనని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? కేటీఆర్ కి ఇన్విటేషన్ ఇస్తున్నారా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. సిద్ధాంత పరంగా పవన్ - కేటీఆర్ మధ్య విభేధాలున్నా ఒకరంటే ఒకరి మధ్య మంచి స్నేహ భావం వుంది. `కాటమ రాయుడు` సమయంలో ఇది బయటపడింది కూడా. ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ - దగ్గుబాటి రానా - నిత్యామీనన్ - సంయుక్త మీనన్ తో పాటు టీమ్ మెంబర్స్ పాల్గొనబోతున్నారు. కేటీఆర్ పాల్గొంటారా లేదా అన్నది తెలియాలంటే మేకర్స్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఈ కార్యక్రమంలో `భీమ్లా నాయక్` టైటిల్ సాంగ్ లో ఓ గాయకుడిగా తన గళం వినిపించిన పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్య పాల్గొంటాడని, ఇటీవల ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని అందించడంతో ఆయనని ఈ సందర్భంగా `భీమ్లా టీమ్ ప్రత్యేకంగా సత్కరించనుందట. అంతే కాకుండా తమన్ లైవ్ కాన్సర్ట్ తో అదరగొట్టబోతున్నాడని కూడా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో పవన్ కు ఎదురు నిలిచే పవర్ ఫుల్ పాత్రలో డానీగా రానా దగ్గుబాటి నటించారు. నిత్యామీనన్ ,సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రాన్ని సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ ఈ నెల 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది