100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో ''కుడి ఎడమైతే'' అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అమలాపాల్ - రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సిరీస్ జూలై 16 నుండి స్ట్రీమింగ్ కానుంది. 'లూసియా' 'యూ టర్న్' ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేయబడిన మోషన్ పోస్టర్ - టీజర్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించచాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'కుడి ఎడమైతే' ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో 'ఇది కల అంటే నేనే నమ్మలేకపొతున్నాను.. కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది' అని రాహుల్ విజయ్ చెబుతుండగా.. మరోవైపు 'ఈరోజు రిపీట్ అవుతోందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు' అని అమలా పాల్ అంటోంది. రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపిస్తుండగా.. పోలీస్ ఆఫీసర్ గా అమలాపాల్ కనిపిస్తోంది. భిన్నమైన రంగాలకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు ఓ యాక్సిడెంట్ వల్ల కలిసినట్లు అర్థం అవుతోంది. ఇద్దరి మధ్య ఆ యాక్సిడెంట్ గురించి ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు. అదే సమయంలో నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసిన ఓ క్రిమినల్ ను పట్టుకుకోడానికి అమలా పాల్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ ఆధ్యంతం థ్రిల్ కి గురి చేస్తూ ఆసక్తికరంగా సాగింది.
'కుడి ఎడమైతే' ట్రైలర్ ని బట్టి చూస్తే ఇదొక టైం లూప్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ - డెలివరీ బాయ్ ఇద్దరూ టైం లూప్ లో ఎందుకు చిక్కుకున్నారు?, దాని నుంచి వాళ్ళు ఎలా బయట పడ్డారు? ఇంతకీ దాన్ని సరిచేసారా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఇందులో రవి ప్రకాష్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కుమార్ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సిరీస్ ని నిర్మించాయి. ఇది పవన్ కుమార్ కు డెబ్యూ వెబ్ సిరీస్. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అయిన ''కుడి ఎడమైతే'' ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Full View