‘గుండెల్లో గోదారి’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కుమార్ నాగేంద్ర. ఆ సినిమాతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. ఆ తర్వాత తాను కమర్షియల్ సినిమాలు కూడా తీయగలనని చాటి చెప్పే ఉద్దేశంతో ‘జోరు’ తీశాడు. కానీ అది కూడా ఆడలేదు. ఇలాంటి టైంలో నారా రోహిత్.. కుమార్ టాలెంటును నమ్మి ‘తుంటరి’ తీసే ఛాన్సిచ్చాడు. తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన ‘మాన్ కరాటె’కు ఇది రీమేక్. ‘తుంటరి’ పెద్ద హిట్టు అని చెప్పలేం కానీ.. ఓ మోస్తరు టాక్ తో బాగానే నడుస్తోంది. పరీక్షల సీజన్ కావడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రావట్లేదు. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కాబట్టి.. పెట్టుబడికి ఢోకా లేదు.
మొత్తానికి ‘తుంటరి’తో తొలి కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న కుమార్ నాగేంద్ర.. ఈ ఊపులో తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఎంతైనా ‘తుంటరి’ రీమేక్ మూవీ కాబట్టి.. ఇక తన ఒరిజినల్ టాలెంట్ చూపించాలని.. సొంత కథలు సిద్ధం చేస్తున్నాడు. అతడి ఫోకస్ ప్రస్తుతం నితిన్ - సాయిధరమ్ తేజ్ లపై పడింది. ‘తుంటరి’ చేయడానికి ముందే రెడీ చేసుకున్న కథలకు మెరుగులు దిద్ది.. ఈ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నాడు కుమార్. మరి వీళ్లిద్దరిలో ఎవరు కుమార్ కు ఓటేస్తారో చూడాలి. నితిన్ - సాయిధరమ్ ఇద్దరూ కూడా చెరో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇద్దరిలో ఎవరితో సినిమా చేయాలన్నా కుమార్.. కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.