నారా రోహిత్ హీరోగా కుమార్ నాగేంద్ర డైరక్షన్ లో తెరకెక్కిన మూవీ తుంటరి. కోలీవుడ్ మూవీ మాన్ కరాటేకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. తొలిసారిగా మాస్ లుక్ - డైలాగ్స్ - పంచ్ లతో నారా రోహిత్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కుమార్ నాగేంద్ర... ఇలా రీమేక్ చేయడానికి చెప్పిన కారణం అందరినీ ఆకట్టుకుంటోంది. గుండెల్లో గోదారి - జోరు చిత్రాలను గతంలో తీశాడు ఈ డైరెక్టర్. రెండూ ఫ్లాపులుగానే మిగిలాయి. దర్శకుడిగా కుమార్ నాగేంద్రకు పేరొచ్చినా, నిర్మాతకు మాత్రం డబ్బులు రాలేదు.
ఇప్పుడు కూడా జోరు చిత్రాన్ని నిర్మించిన నిర్మాతే.. తుంటరిని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. తన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో నిరుత్సాహం చెందానన్న కుమార్ నాగేంద్రన్.. మరోసారి ప్రొడ్యూసర్ ని ఇబ్బంది పెట్టడం, నిర్మాతకి దెబ్బ తగలడం ఇష్టం లేకే రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యానని చెప్పాడు. రీమేక్ చిత్రాలను చాలా మందే తీస్తూ ఉంటారు కానీ.. ఇలా నిజాయితీగా అసలు కారణం చెప్పే వాళ్లు సాధారణంగా కనిపించరు.
కత్తి లాంటి కథ, ఆ హీరోకి బాగా నప్పుతుంది, ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాం.. లాంటి సాకులు కాకుండా.. ఇప్పటికే ప్రూవ్ అయిన స్టోరీ అయితే, నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటాడనే ఈ రీమేక్ చేస్తున్నట్లు కుమార్ నాగేంద్ర చెప్పడం ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ సీరిసయ్ రోల్స్ తో ఆకట్టుకున్న నారా రోహిత్.. ఇలాంటి కామెడీ రోల్ చేస్తే విభిన్నంగా ఉంటుందని చెప్పి ఒప్పించాడట. నారా రోహిత్ కూడా ఈ పాయింట్ బాగా నచ్చడంతో వెంటనే కన్విన్స్ అయ్యాడని ఈ దర్శకుడు చెబుతున్నాడు.