ఫస్ట్‌ వీకెండ్‌.. 6.4 కోట్ల కుమారి!!

Update: 2015-11-23 16:06 GMT
మొదటి వీకెండ్ లో ఆరున్నర కోట్లు.. ఇది కుమారి సాధించిన షేర్. విపరీతమైన రెస్పాన్స్.. హౌజ్ ఫుల్ బోర్డులు.. ఇది ఇంకా పరిస్థితి. ఓ చిన్న సినిమాగా రూపొంది, మీడియం బడ్జెట్ కంటే ఓ మోస్తరు తక్కువగానే రిలీజ్ అయిన కుమారి 21ఎఫ్.. టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తోంది.

తొలి మూడు రోజుల్లోనే కుమారికి నైజాంలో 2.35 కోట్లు రాగా, కోస్తా-సీడెడ్ కలిపి 2.95కోట్లు కొల్లగొట్టింది. కర్నాటకలో 46 లక్షల రాగా, అమెరికా మార్కెట్ నుంచి 63లక్షలు రాబట్టింది కుమారి 21ఎఫ్. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కుమారికి వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా... అక్షరాలా 10 కోట్ల 58 లక్షల  రూపాయలు.. అంటే అక్షరాలా 6.43 కోట్ల షేర్‌ వచ్చిందనమాట. ఇకపోతే సినిమా మొత్తాన్ని 10 కోట్ల ధియేట్రికల్‌ రైట్స్‌ రూపంలో అమ్మేశారు. సో.. ఫస్ట్ వీకెండ్ లోనే, అంటే మూడే మూడు రోజుల్లో షేర్ రూపంలో 60 శాతం పెట్టుబడి వెనక్కొచ్చేసింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికే.. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కి వచ్చేయడం ఖాయమంటున్నారు.

ఈ మూవీకి రివ్యూలు మిక్సెడ్ గానే వచ్చాయి. అయితే ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఏ - బీ - సీ సెంటర్లు.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి కూడా సూపర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా సుకుమార్ కి క్లాస్ - మాస్ లో ఉన్న పేరు - దేవిశ్రీ మ్యూజిక్ - కుమారిని ప్రచారం చేసిన తీరుతోపాటు.. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ బోల్డ్ నెస్ కూడా కారణమేనని చెప్పాలి. భారీ చిత్రాల వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్.. చిన్న సినిమాల జోష్ తో హ్యాపీగా ఉంది.
Tags:    

Similar News