కుమారి.. కుర్రాళ్లకు ఫుల్ కిక్కే

Update: 2015-11-15 10:02 GMT
అనుకున్నదే అయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందించి, స్వయంగా నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’  సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా పెద్దలకు మాత్రమే. తెలుగులో చాన్నాళ్ల తర్వాత ‘ఎ’ సర్టిఫికెట్ తెచ్చుకున్న రెగ్యులర్ సినిమా ఇది. చండశాసనురాలిగా పేరు తెచ్చుకున్న ధనలక్ష్మి ఉన్నపుడు సెన్సార్ బోర్డు చాలా స్ట్రిక్టుగా ఉండేది కానీ.. ఆమె వెళ్లిపోయాక అడల్ట్ కంటెంట్ ఉన్నా యు/ఎతో సరిపెట్టేస్తున్నారు. ఐతే ‘కుమారి 21 ఎఫ్’ను మాత్రం అలా తేలిగ్గా వదిలేయడానికి వీల్లేకపోయిందట.

ట్రైలర్ చూస్తేనే కుమారి.. కుర్రకారును టార్గెట్ చేసుకున్న రొమాంటిక్ సినిమా అని అర్థమైంది. సినిమాలో లిప్ లాక్సే కాదు.. రొమాంటిక్ సీన్స్ కూడా ఓ రేంజిలో ఉంటాయని అంటున్నారు. ఇందులో రేప్ సీన్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది కానీ.. డైరెక్టర్ మాత్రం అలాంటిదేమీ లేదని, కాకపోతే కొంచెం హై డోస్ రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉంటాయని చెబుతున్నాడు. మాటలు కూడా యూత్ కి కనెక్టయ్యేలా కొంచెం శ్రుతి మించినట్లే చెబుతున్నారు. సినిమాలో బీప్ సౌండ్లు అవీ బాగా వాడాల్సి వచ్చిందట. ఐతే ‘ఎ’ సర్టిఫికెట్ రావడం సినిమాకు నెగెటివ్ ఏమీ కాదు. సుక్కు టార్గెట్టే యూత్. కాబట్టి ‘ఎ’ అనగానే ఇంకా ఉత్సాహంగా సినిమాకు వస్తారు యూత్ ఆడియన్స్. ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News