నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అగ్ర నటి

Update: 2020-06-15 15:05 GMT
బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రముఖ నటి ఖుష్బూ కూడా ట్విట్టర్ లో తన బాధను వెళ్లబోసుకున్నారు. సుశాంత్ లాగానే తాను కూడా ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడ్డానని ఖుష్బూ తెలిపారు.

సుశాంత్ కు ఎదురైన పరిస్థితులు, సమస్యలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయని.. వాటిని అధిగమించాలని ఖుష్బూ సూచించారు. తనకు అలాంటి సమస్యలు లేవని చెబితే అది అబద్ధమే.. నేనూ మానసిక ఒత్తిడికి గురయ్యా.. నా జీవితాన్ని ఆత్మహత్యతో ముగించాలనుకున్నా.. కానీ ఓ సందర్భంలో పోరాడాలని కసి పెరిగింది. ఆ సమస్యల కంటే నేను ధృడమని నిరూపించాలనుకున్నా.. ’ అని ఖుష్బూ తన ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిన నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

నా జీవితం ఒకానొక దశలో నిలిచిపోయిందని.. ఎటూ పాలుపోని పరిస్థితుల్లో నిలబడిపోయానని.. ఈ సమస్యల్ని భరించడం కంటే ఆత్మహత్యనే సులభమార్గం అనుకున్నానని ఖుష్బూ తెలిపింది. నా ధైర్యం వెనక్కిలాగిందని.. స్నేహితులు దేవదూతాల్లా మారి సహకరించారని.. విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకున్నానని బాధలను వెనక్కి నెట్టి ఈరోజు ఇలా ఉన్నానని ఖుష్బూ తెలిపారు.

పరాజయాల్ని విజయాలు మార్చుకోవడం నేర్చుకున్నాని ఖుష్బూ తెలిపారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో సీని నటులకు నెటిజన్లకు స్ఫూర్తిని నింపారు.
Tags:    

Similar News