మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ కూడా చేతులెత్తేశాడే!

Update: 2022-08-11 16:00 GMT
టాలీవుడ్ ని క‌ష్ట‌కాలం నుంచి కాపాడే వారే లేరా? అంటూ గ‌త రెండు నెల‌లుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూశాయి. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే మ‌నం కూడా బాలీవుడ్ స‌ర‌స‌న చేరాల్సిందేనా? అంటూ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే అంద‌రి భ‌యాల్ని పోగొడుతూ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `బింబిసార‌`, దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన రొమాంటిక్ ఎపిక్ ల‌వ్ స్టోరీ `సీతా రామం` ఆగ‌స్టు 5న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచాయి.

దీంతో యావ‌త్ టాలీవుడ్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. ఎన్నాళ్ల‌కెళ్లకు గుడ్ ఫ్రైడే వ‌చ్చేసింద‌ని సంబ‌రాల్లో మునిగితేల‌డం మొద‌లు పెట్టింది. ప్రేక్ష‌కులు గ‌త రెండు నెల‌లుగా థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డం, వ‌రుస‌గా సినిమాలు ఫ్లాప్ లు అవుతూ వుండ‌టంతో తీవ్ర‌భ‌యాందోళ‌న‌కు గురైన టాలీవుడ్ `బింబిసార‌`..సీతారామం ల స‌క్సెస్ తో నూత‌నోత్తేజాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో మ‌ళ్లీ సినిమా బండి ప‌ట్టాలెక్కింది. కానీ బాలీవుడ్ మాత్రం ఇప్ప‌టికీ అదే ఫ్లాపుల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తోంది.

బాలీవుడ్ కు ఈ మ‌ధ్య అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. ఏ సినిమా విడుద‌లైనా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేస్తోంది. స్టార్ హీరోలు న‌టించిన సినిమాలేన‌వీ హిట్ టాక్ ని సొంతం చేసుకోలేక‌పోతుండ‌టంతో బాలీవుడ్ ని కాపాడే హీరోనే లేడా? అనే చ‌ర్చ జ‌ర‌గ‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ దృష్టి మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మూవీ `లాల్ సింగ్ చ‌డ్డా`పై ప‌డింది. `థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌` వంటి భారీ డిజాస్ట‌ర్ త‌రువాత అమీర్ న‌టించిన సినిమా కావ‌డం, హాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ `ఫారెస్ట్ గంప్‌` ఆధారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో బాలీవుడ్ కు ఖ‌చ్చితంగా ఈ మూవీతో అమీర్ ఖాన్ పూర్వ వైభ‌వాన్ని తీసుకొస్తాడ‌ని అంతా భావించారు.

ఆగ‌స్టు 11న విడుద‌లైన `లాల్ సింగ్ చ‌డ్డా` అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ బిగ్ షాక్ ఇచ్చింది. అంతా అమీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని భారీ అంచ‌నాలు పెట్టుకుంటే ఆ అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ బిగ్ ఫ్లాప్ గా నిలిచి తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్  అయినా బాలీవుడ్ ఫ్లాపుల ప‌రంప‌ర‌ను కాపాడతాడ‌నుకుంటే త‌ను కూడా చేతులు ఎత్తేయ‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బాయ్ కాట్ `లాల్ సింగ్ చడ్డా` అంటూ దేశ వ్యాప్తంగా ఈ మూవీపై జ‌రిగిన ప్ర‌చారం కంటెంట్ బాగుంటే ఏ మాత్రం ప‌ని చేయ‌ద‌ని భావించారు. కానీ కంటెంటే లేక‌పోవ‌డం, ఆర్ట్ ఫిలింలా వుంద‌నే విమ‌ర్శ‌లు త‌లెత్త‌డంతో తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు వ‌చ్చాయి.

బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఈ మూవీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. బాలీవుడ్ కి `లాల్ సింగ్ చ‌డ్డా`తో బిగ్ క‌మ్ బ్యాక్ ఇవ్వాల‌నుకున్న అమీర్ బండిలో ఫ్యుయ‌ల్ అయిపోవ‌డంతో మ‌ధ్య‌లోనే చేతులెత్తేశాడ‌ని కామెంట్ లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇదే సినిమాతో విడుద‌లైన అక్ష‌య్ క‌మార్  `ర‌క్షా బంధ‌న్‌` కూడా ఇదే బాట ప‌ట్టడంతో బాలీవుడ్ ని కాపాడే నాధుడే లేడా అని బాలీవుడ్ వ‌ర్గాలు నిట్టూరుస్తున్నాయ‌ట‌.
Tags:    

Similar News