బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ను తెలుగు లో కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. తెలుగు వర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి సమర్పించేందుకు ముందుకు రావడం వల్ల అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
సినిమా ప్రమోషన్ కోసం చిరంజీవి.. నాగార్జునతో పాటు సినిమాలో కీలక పాత్రలో నటించిన నాగ చైతన్య కూడా మీడియా ముందుకు రావడంతో కావాల్సినంత పబ్లిసిటీ దక్కింది.
తాజాగా మరోసారి ఆమీర్ ఖాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుసగా మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఆమీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీ పై ఓటీటీ ప్రభావం గురించి మాట్లాడాడు.
ఓటీటీ వల్ల సినిమా ఇండస్ట్రీ కి నష్టం అనేది పూర్తిగా వాస్తవం కాదు కాని సినిమా విడుదల అయిన మూడు నాలుగు వారాలకే ఓటీటీకి ఇచ్చేలా ఒప్పందాలు చేసుకోవడం మంచిది కాదు అన్నాడు.
సినిమా తక్కువ సమయంలో ఓటీటీలో వస్తుంది అనే ఉద్దేశ్యంతో థియేటర్ కు జనాలు వెళ్లే అవకాశం లేదు. అందుకే సినిమాలను డబ్బు ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశ్యంతో వెంటనే ఓటీటీకి ఇవ్వడం అనేది శ్రేయస్కరం కాదు అంటూ ఆమీర్ పేర్కొన్నాడు. సినిమా ప్లాప్ అయినా సక్సెస్ అయినా కూడా ఓటీటీ లో కనీసం 50 రోజుల తర్వాత వస్తేనే బెటర్ అనేది ఆమీర్ ఖాన్ అభిప్రాయంగా పేర్కొన్నారు.
ఓటీటీ ల్లో కొన్ని సినిమాలు మరీ మూడు నాలుగు వారాల్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కనుక అన్ని సినిమాలు కూడా అలాగే వస్తాయేమో అంటూ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా వెయిట్ చేయడం వల్ల సినిమా లకు నష్టాలు తప్పడం లేదు. ఓటీటీ లో ముందు విడుదల చేస్తే కాస్త డబ్బు ఎక్కువ వచ్చేది నిజమే కానీ మొత్తం ఇండస్ట్రీ భవిష్యత్తులో నష్టపోతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.