పోయినేడాది తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తీయబోతున్నట్లుగా నందమూరి బాలకృష్ణ ప్రకటించడం ఆలస్యం.. దానిపై పెద్ద చర్చే నడిచింది. వెంటనే ఈ సినిమా విషయంలో కొన్ని అభ్యంతరాలు.. కాంట్రవర్శీస్ మొదలైపోయాయి. ఐతే ఆ ప్రకటన తర్వాత బాలయ్య సైలెంటయ్యాడు. ఈ సినిమా గురించి అప్ డేట్స్ లేవు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ఈ సినిమా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ప్రచారం మొదలైంది. వర్మ కూడా ఎన్టీఆర్ మీద సినిమా తీయబోతున్న విషయాన్ని ధ్రువీకరించాడు. కాకపోతే ఆయన.. బాలయ్య కలిసే సినిమా చేస్తారా అన్నదానిపైనే స్పష్టత రావాల్సి ఉంది. ఏదైతేనేం నిన్నట్నుంచి ఎన్టీఆర్ సినిమా మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది.
ఇంతలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి లైన్లోకి వచ్చేశారు. ఎన్టీఆర్ సినిమాపై ఇంతకుముందే అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఆమె.. తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సినిమాలో ఆయన పాత్రను బాలకృష్ణ చేయకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కూడా చూపించాలనుకుంటే మాత్రం బాలకృష్ణతో ఎన్టీఆర్ పాత్రను చేయించడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్టీఆర్ సినిమా జీవితం వరకు చిత్రించేట్లయితే బాలకృష్ణ హీరోగా చాలా బావుంటాడు. ఆయన సరిపోతాడు. అయితే.. రాజకీయ జీవితాన్ని కూడా సినిమాలో చూపించేట్లయితే.. బాలకృష్ణ నటించడం కరెక్ట్ కాదు. మరో నటుణ్ని ఎవరినైనా పెట్టి చేస్తేనే బాగుంటుంది. చంద్రబాబు తనకు బావ గనుక... ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సన్నివేశాలు వంటివి చేస్తున్నప్పుడు ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలే ఆ అబ్బాయి చాలా అమాయకంగా ఉంటాడు. అలాంటి అబ్బాయి ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై సినిమా చేయడం బాగుండదు’’ అని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. మరి ఈ అభిప్రాయాన్ని బాలయ్య పట్టించుకుంటాడా?