సర్దార్ ఐటెం.. బాగా బోల్డుగా ఉందే

Update: 2016-03-30 05:25 GMT
ఓ పన్నెండేళ్ల క్రితం జూలీ పేరుతో వచ్చిన మూవీ బాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పింది. నేహ ధూపియా  హీరోయిన్ గా దీపక్ శివదాసాని తెరకెక్కించిన ఈ చిత్రంతో... కేవలం స్కిన్ షోని బేస్ చేసుకుని ఓ మూవీని హిట్ కొట్టచ్చని ప్రూవ్ చేశాడు డైరెక్టర్. ఇప్పుడలాంటి మూవీ మరొకటి బాలీవుడ్ లో సిద్ధమవుతోంది. అదే జూలీ2. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన ఐటెం భామగా కనిపిస్తున్న రాయ్ లక్ష్మీ... జూలీ2లో లీడ్ రోల్ పోషిస్తుండడం విశేషం.

జూలీ2కి సంబంధించిన ఓ పోస్టర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఫెన్స్ అవతల వైపు నుంచును.. కేవలం ఒంటిపై బ్రా మాత్రమే ధరించి, ఇవతలివారిని మత్తుగా లోపలకు పిలుస్తున్నట్లుగా ఉంది రాయ్ లక్ష్మీ లుక్. 'జూలీ నుంచి మరో లుక్' అంటూ స్వయంగా తనే ఈ పిక్చర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది రాయ్ లక్ష్మీ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మంచి ఆఫర్స్ తో రెచ్చిపోతున్న ఈ సుందరాంగికి... ఇదే మొదటి బాలీవుడ్ మూవీ.

జూలీ, జూలీ2 లకు మధ్యలో శివదాసాని మరో చిత్రం కూడా తీశాడు మిస్టర్ బ్లాక్ మిస్టర్ వైట్ అంటూ తెరకెక్కిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర పేలిపోయింది. అయితే... జూలీ2పై మాత్రం ఇప్పుడు అంచనాలు  బాగానే ఉన్నాయి. అడల్ట్ కామెడీ, బోల్డ్ టైపు చిత్రాలకు సీజన్ నడుస్తుండడంతో.. ఆ క్రేజ్ ను జూలీ2 క్యాచ్ చేసేస్తుందని అంటున్నారు. ఈ మూవీతో సక్సెస్ కొట్టగలిగితే... రాయ్ లక్ష్మీకి బాలీవుడ్ లో ప్లేస్ దొరికేసినట్లే.
Tags:    

Similar News